YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జనసేన రెచ్చిపోతోంది

 జనసేన రెచ్చిపోతోంది
ఏలూరు మండలం మాదేపల్లి గ్రామదర్శిని కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గోన్నారు. ఈ సందర్బంగా అయన  పవన్,చిరంజీవిల పై ఘాటు వ్యాఖ్యలు చేసారు.  ఆంధ్రప్రదేశ్ విడిపోవడాకి మొదటి ముద్దాయి మీ చిరంజీవి. నిన్నకాక మొన్న రాజకీయాలలోకి వచ్చిన పవన్ సియం కుర్చి కావాలనుకోవటం అతి ఆశేనని అయన అన్నారు.  సినిమాలలో రెమ్యునరేషన్ తిసుకున్నట్లు కాదు సియం కుర్చి అంటే. ప్రత్యేకహోదా కావాలని విజయవాడలో మీటింగ్ పెట్టి హిందీలో నాలుగు మాటలు చెప్పావు, డిల్లి వెళ్ళి నిరసన తెలిపావాని అయన పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీ కోసం కాపు సోదరులు ఆస్తులు అమ్మి సపోర్ట్ చేస్తే వాళ్ళను బలి పశువు చేసింది చిరంజీవి. తెలుగువారి ఆత్మగౌరవాన్ని బంగాళాఖాతంలో కలిపిన గనత  గౌరవనీయులు చిరంజీవిగారిదే. మీ అన్న చిరంజీవి ఇంత ద్రోహం చేస్తే నువ్వు ఎందుకు ప్రశ్నించలేక పోతున్నావ్ పవన్ కు సూటి ప్రశ్న వేసారు. నీకు రక్త సంబంధం అడ్డు వస్తుందా పవన్ కల్యాణ్ అని నిలదీసారు. అంత రక్త సంబంధం ఉన్నవాడివి ప్రజారాజ్యం నడిపించకపోయావా. జనసేనపార్టీ ఎందుకు పెట్టావు. పవన్ కల్యాణ్ నీ ఫ్యాన్ రెచ్చిపోతున్నారు నన్ను ఓడిస్తాను జనసేనపార్టీ అభ్యర్ధిని గెలిపిస్తానని మీరు కాదు మీ జేజేమ్మలు కూడా నన్ను ఓడించలేరని అయన అన్నారు.

Related Posts