భారత జట్టు కెప్టెన్ కోహ్లీ మరో అరుదైన రికార్డు సృష్టించాడు. డర్బన్ వేదికగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ..మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ రికార్డును సమం చేశాడు. గతంలో 11 శతకాలతో జట్టు సారథిగా అత్యధిక శతకాలు సాధించిన భారత కెప్టెన్‌గా గంగూలీ రికార్డు నెలకొల్పాడు. మరే భారత జట్టు కెప్టెన్...ఇన్ని శతకాలు చేయలేదు. తాజాగా విరాట్ కోహ్లీ ఆ రికార్డును సమం చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ 112 పరుగులు సాధించాడు. వన్డే కెరీర్‌లో కోహ్లీకి ఇది 33వ శతకం కాగా కెప్టెన్‌గా 11వ శతకం కావడం విశేషం. గంగూలీ 142 ఇన్నింగ్స్‌ల్లో 11 శతకాలు సాధించగా.. విరాట్ కోహ్లీ కేవలం 41 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ ఘనతను సాధించాడు.
డర్బన్‌లో గురువారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య దక్షిణాఫ్రికాపై భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆరు వన్డేల సిరీస్‌లో 1-0తో భారత్ ఆధిక్యంలో నిలుస్తోంది. ఈ వన్డే సిరీస్‌లో భాగంగా రెండో వన్డే ఆదివారం సెంచూరియన్‌లో జరగనుంది.