YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

క్లౌడ్ అకౌంటింగ్ సాఫ్ట్ వేర్ ఫై అవగాహన ఒప్పందం

క్లౌడ్ అకౌంటింగ్ సాఫ్ట్ వేర్ ఫై అవగాహన ఒప్పందం
క్లౌడ్ అకౌంటింగ్ సాఫ్ట్ వేర్ విభాగంలో రాష్ట్రంలోని బికామ్, ఎంకామ్, ఎంబిఎ విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ) జోహో, ఇన్ స్టా ఈఎంఐ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.ఏపీఎస్‌ఎస్‌డీసీ ఇంచార్జ్ ఎండి, సీఈవో ఎం. వరప్రసాద్ సమక్షంలోవారు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.ఇందులోభాగంగాఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 391 ఎంప్లాయిబిలిటీ స్కిల్స్ సెంటర్లలోజోహో, ఇన్ స్టా ఈఎంఐ సంస్థలఆధ్వర్యంలోవిద్యార్థులకు నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు అందుబాటులోకి రానున్నాయి.అనంతరం జోహో సంస్థ డైరెక్టర్ నారాయణన్ మాట్లాడుతూ భవిష్యత్తులో క్లౌడ్ అకౌంటింగ్ సాఫ్ట్ వేర్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుందన్నారు. తమ సంస్థ ద్వారా బికామ్ ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇస్తామని, తద్వారా మార్కెట్ లో వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇప్పటికే తమ కార్యాలయాన్ని తిరుపతిలో ప్రారంభించామని, ఆంధ్రప్రదేశ్ ను తాము ప్రత్యేకమైన రాష్ట్రంగా గుర్తిస్తున్నామని నారాయణన్ అన్నారు.ఇన్ స్టా ఈఎంఐ సీఈవో హనుమంతు మాట్లాడుతూ ఫైనాన్సియల్ మార్కెట్ లో ఉండే అవకాశాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా విద్యార్థులకు స్వయం ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఇంచార్జ్ ఎండి, సీఈవో ఎం. వరప్రసాద్, సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు అనిల్ కుమార్, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.  

Related Posts