తారాగణం: బెల్లంకొండ సాయిశ్రీనివాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్, జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య తదితరులు
మ్యూజిక్: హర్షవర్ధన్
ప్రొడ్యూససర్: అభిషేక్ నామా
స్క్రీన్ ప్లే-డైరెక్షన్: శ్రీవాస్
హీరో టాలీవుడ్ లో స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఫస్ట్ మూవీతోనే కమర్షియల్ హిట్ దుకున్నాడు. ఆ తర్వాత ప్రతి సినిమాకు మార్కెట్ పెంచుకుంటున్నాడు. మాస్ ఆడియన్సే లక్ష్యంగా వచ్చిన శ్రీనివాస్ సాక్ష్యంతో కూడా అదే ప్రయత్నం చేశాడు. ప్రతిపనికి పంచభూతాలే సాక్షి అనే కాన్సెప్ట్ తో సినిమాను తీశాడు డైరెక్టర్ శ్రీవాస్. లక్ష్యం, లౌక్యం, డిక్టేటర్ సినిమాలతో హిట్లు కొట్టిన శ్రీవాస్ నాలుగో హిట్ సాధించాడా..? సాయి శ్రీనివాస్ ఖాతాలో మరో హిట్ చేరిందా..? రివ్యూలో చూద్దాం..
స్టోరీ: ఓసంస్థాన రాజుగారి కుటుంబం(శరతకుమార్ ఫ్యామిలీ)తనకు అడ్డు వస్తోందని శత్రువులైన మునుస్వామి సోదరులు(జగపతిబాబు బ్రదర్స్) ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తోంది. దీనికి ఎలాంటి సాక్ష్యం ఉండకూడదని... పసి పిల్లల నుంచి పశువుల వరకూ అందర్నీ చంపేస్తారు. ఐతే ఆ ఇంటి వారసుడు విశ్వ (సాయి శ్రీనివాస్) మాత్రం తప్పించుకుంటాడు. అక్కడి నుంచి ఫారిన్ లో పెరిగి పెద్దవాడవుతాడు. 20 ఏళ్ల తర్వాత భారత్ వచ్చి తన శత్రువులపై తనకు తెలియకుండానే ప్రతీకారం తీర్చుకుంటాడు.
ఎలా ఉంది?: రివెంజ్ డ్రామాతో టాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే దానికి సరికొత్త టచ్ ఇచ్చాడు డైరెక్టర్. తన తల్లిదండ్రులను చంపిన వారిని ఇరవై ఏళ్ల తర్వాత హీరో చంపాడు అనేది చాలా రొటీన్ పాయింట్. దానికి పంచభూతాలు అనే కాన్సెప్ట్ జోడించడం డిఫరెంట్ పాయింట్. గాలి, నీరు, నిపు, నేల ఆకాశాలను డైరెక్టర్ చాలా ఇంటెలిజెంట్ గా స్టోరీలో చొప్పించాడు. సినిమా ఓపెనింగ్ బ్యాక్, కథ నేపథ్యం చెప్పడం చక్కగా ఉంది. స్టోరీ ఫారిన్ షిఫ్ట్ అయిన తర్వాత విశ్వ, సౌందర్య లహరి (పూజా హెగ్దే)ల లవ్ స్టోరీ కాస్తా సాగదీసినట్లు అనిపిస్తుంది. హీరో ఇండియాకు రావడం, శత్రువులను చంపే ఎపిసోడ్ స్టార్ట్ అవగానే స్టోరీ పరుగులు పెడుతుంది. ఇక ఇంటర్వెల్ సీన్ సినిమాలో ఆసక్తికి రేకెత్తిస్తుంది. సెకండ్ హాఫ్ లో హీరో తన శత్రువులను చంపడం మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. యాక్షన్ ఎపిసోడ్ ఒక్కోటి ఒక్కో తరహాలో సాగుతుంది. పంచ భూతాలను యాక్షన్ ఎపిసోడ్‌లో మేళవించాలన్న ఆలోచన రొటీన్ కథను సరికొత్తగా ఆవిష్కరించింది. కథానాయకుడికి తన గతం తెలియకుండా దాస్తూనే, తనకు అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునేలా చూపించడం కొత్త ఎత్తుగడ. క్లైమాక్స్ ముందుగానే ఊహించినట్లే అనిపించినా మాస్ ను మెప్పిస్తుంది.
ఎలా చేశారు?: ప్రతి సినిమాకు మాస్ ఆడియన్స్ ను రీచ్ అవ్వాలన్న తపన హీరో సాయి శ్రీనివాస్ లో కనిపిస్తుంది. హీరో పాత్రలో పెద్దగా మెరుపులు లేకపినా ఆ రోల్ కు తగ్గట్లుగా నటించాడు. ఎమోషనల్ డైలాగ్స్ లో కొంచెం మెచ్యూరిటీ రావాలి. పూజా హెగ్దే గ్రామరస్ గా అనిపించినా..మరీ స్లిమ్గా ఉంది. ఇక విలన్ గ్యాంగ్ లో నలుగురున్నా.. డైరెక్టర్ మాత్రం జగపతి బాబునే హైలెట్ చేశాడు. వెన్నెల కిషోర్, కృష్ణభగవాన్, రఘుబాబు, పోసాని, రావు రమేష్ ఇలా నట బృందంలో చాలా మందే కనిపిస్తారు. టెక్నికల్ గా సినిమా టాప్ లో ఉంటుంది. బడ్జెట్ కు తగ్గట్లుగానే రిచ్ గా తీశారు. పాటలు ఓకే అనిపించినా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్దగా ప్రభావం చూపలేదు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ కొన్నిచోట్ల పేలాయి. పంచభూతాలను ఆధారంగా చేసుకున్న డైరెక్టర్ కథను బాగానే తెరకెక్కించాడు. మొత్తానికి సినిమా మాస్ ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతుంది.
ప్లస్ పాయింట్స్
+ కాన్సెప్ట్
+ యాక్షన్ ఎపిసోడ్స్
+ మేకింగ్
బలహీనతలు
- ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్లు