YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ఇమ్రాన్ నుంచి పాఠాలు నేర్చుకోవాలి

ఇమ్రాన్ నుంచి పాఠాలు నేర్చుకోవాలి
పాకిస్థాన్ లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ విజయం రాజకీయ పార్టీలు స్థాపించే వారికీ ఒక చక్కటి సందేశం అందజేస్తుంది. చివరి బంతివరకు పోరాడాలని క్రికెట్ లో సూత్రం. ఫుట్ బాల్ లోను ఈ సూత్రం వర్తిస్తుంది. మ్యాచ్ ముగుస్తుంది అనుకునే సమయంలో ఆఖరి నిమిషంలో కొట్టే గోల్ ఫుట్ బాల్ మైక్ లో ఫలితాన్నే తలకిందులు చేస్తుంది. అదే సూత్రంతో 22 ఏళ్లపాటు అలుపెరగకుండా రాజకీయ ఆట ఆడుతూ వచ్చాడు ఈ మాజీ క్రికెటర్.తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలను పాకిస్థాన్ లో ఇమ్రాన్ సాగించిన రాజకీయ ప్రస్థానంతో పోలిస్తే లోక్ సత్తా, ప్రజారాజ్యం సుదీర్ఘ పోరాటం సాగించి ఉంటే అధికార పీఠం అందుకుని ఉండేవని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. రాత్రికి రాత్రి ఏ పార్టీ అధికారం సాధించలేదని అంటున్నారు. పార్టీ స్థాపించిన వెంటనే ముఖ్యమంత్రి ప్రధానులు కావాలనుకుంటే అవ్వరని, ప్రజాక్షేత్రంలో తుది వరకు వుండే వారికి ఎదో ఒక రోజు అధికారం అందుతుందన్న సందేశం పక్క దేశం పాక్ అందించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.పుబ్బలో పుట్టి మఖలో కనుమరుగయ్యేలా మారిపోతున్న రాజకీయ వ్యవస్థలో తాను నమ్మిన సిద్ధాంతంకోసం తనను నమ్ముకున్న వారికోసం అధికారమే పరమావధిగా పోరాడుతూనే ఉండాలన్న సూత్రం తూచా తప్పకుండా ఇమ్రాన్ పాటించాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలిసారి పాక్ కి కప్ అందించిన కెప్టెన్ గా ఆ దేశ వాసుల్లో క్రేజ్ సాధించిన ఇమ్రాన్ క్రీడల్లో లాగే సహనంతో అసమాన పోరాటమే ఊపిరిగా తన పార్టీ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ ( పిటిఐ )ను నడిపించారు. తొలి ఎన్నికల్లో ఒక్కసీటు బోణి కొట్టకపోయినా పార్టీని నిర్మిస్తూ లోటుపాట్లు సరిదిద్దుకుంటూ ఒక బలీయమైన రాజకీయ వ్యవస్థగా అధికారపీఠం కైవసం చేసుకునే దిశగా తన పార్టీ సైన్యాన్ని ఒక్కడై నడిపించాడు ఇమ్రాన్. పాక్ లో 1996 లో తొలిసారి 9 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు గెలవలేదు ఇమ్రాన్. అదే ఇమ్రాన్ 22 ఏళ్ళ తరువాత పోటీ చేసిన ఐదు స్థానాల్లో అఖండ విజయాన్ని అందుకోవడం అరుదైన రికార్డ్. ఇమ్రాన్ విజయంలో తీవ్రవాదులు పాక్ సైన్యం సహకారం ఉందన్న మాట ఎంత నిజమైనా ప్రజల అందండలు ఎంతో కొంత లేకుండా ఆయన ఈ ఘనత సాధించడం సాధ్యం కాదు.ప్రజారాజ్యం పార్టీ 2014 లో సీన్ లో ఉండగా కాంగ్రెస్ విభజన చేసి ఉంటే ప్రజలు చిరంజీవికి పట్టం కట్టి వుండేవారేమోననే కూడా విశ్లేషణలు సాగుతున్నాయి. కానీ అయన పార్టీని విలీనం చేయడం ఆత్మహత్యా సదృశ్యమని కొందరంటున్నారు. విజయకాంత్ పార్టీని సైతం దీనికి ఉదాహరణగా చూపిస్తున్నారు. అధికారం దక్కినా దక్కక పోయినా ప్రజల్లో వుండే కామ్రేడ్ లను ఉదహరిస్తున్నారు కొందరు. దశాబ్దాల తరబడి వారు సాగించే పోరాటానికి ఎదో రోజు ఫలితం దక్కుతుందని రాజకీయాల్లో అధికారమే శాశ్వతం అనుకోకుండా తడబడినా నిలబడినవారే నేతలుగా నిలుస్తారన్నది పాక్ ఎన్నికల ఫలితాలు చాటి చెప్పాయంటున్నారు. మన దేశంలో వచ్చే ఏడాదే ఎన్నికలు ఉండటంతో రాజకీయ వేడి పెరిగి ప్రపంచంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా దానికి ఇక్కడి వాటితో పోల్చుకోవడం విశేషం.

Related Posts