న్యూజీలాండ్ విధ్వంసకర ఆటగాడు మార్టిన్ గుప్తిల్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ టోర్నీ టీ20 బ్లాస్ట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వర్సెస్టర్‌షైర్ తరపున ఆడుతున్న గుప్తిల్ శుక్రవారం నార్తాంప్టన్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు.35 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో శతకం బాదాడు. ఈ నేపథ్యంలో టీ20ల్లో అత్యంత వేగవంతంగా సెంచరీ నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. టీ20ల్లో వేగవంతమైన సెంచరీ క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ 30 బంతుల్లో సెంచరీ సాధించి తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానంలో రిషబ్ పంత్ ఉన్నాడు. మూడో స్థానంలో 35 బంతుల్లో టీ20 ఫార్మాట్‌లో సెంచరీ చేసిన డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా), రోహిత్ శర్మ(భారత్), లూయిస్ వాన్‌డెర్(నమీబియా)లు ఉన్నారు.