ప్రధాని మోదీపై టీడీపీ ఎంపీ కేశినేని నాని నిప్పులు చెరిగారు. దేశంలో సమస్యలను గాలికొదిలేసి మోదీ విదేశీ పర్యటనలకు పరిమితమయ్యారని దుయ్యబట్టారు. మరోవైపు మోదీపై పోరాడాల్సిన సమయంలో వైసీపీ పలాయనం చేసిందన్నారు. ఇది కుమ్మక్కు రాజకీయమేనని ఆరోపించారు. వైసీపీ ట్రాప్‌లో టీడీపీ పడలేదని.. జగన్, గాలి జనార్దన్‌రెడ్డి వలలో మోదీనే పడ్డారని విమర్శించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దేశమంతటి దృష్టికి తీసుకెళ్లడంలో తెలుగు దేశం పార్టీ విజయవంతమయ్యిందన్నారు. కాంగ్రెస్-బీజేపీకి సమదూరంలో టీడీపీ ఉందని కేశినేని నాని వ్యాఖ్యానించారు.