- బ్రిటన్ మంత్రి లార్డ్ బ్రీఫ్లీ తన పదవికి రాజీనామా..
- రాజీనామాను తిరస్కరిస్తున హౌస్ ఆఫ్ లార్డ్స్
చిన్న కారణంతో బ్రిటన్ మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. సాధారణ రాజకీయ నాయకులకు భిన్నంగా వ్యవహరించడం వల్ల ఆ సంఘటన చర్చనీయాంశంగా మారింది. సభకు ఆలస్యంగా వచ్చినందుకు బ్రిటన్ మంత్రి లార్డ్ బ్రీఫ్లీ తన పదవికి రాజీనామా చేశారు. సభలోని ఇతర సభ్యులు వద్దని చెప్పినా ఆయన వినలేదు.
బ్రిటన్‌లోని హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో బుధవారం ప్రశ్నోత్తరాల సమయం జరుగుతోంది. లేబర్ పార్టీకి చెందిన నేత రుత్ లిస్టర్ తన ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం కోరారు. ఆ ప్రశ్నకు డిఎఫ్ఐ శాఖకు చెందిన మైకెల్ బేట్స్ సమాధానం చెప్పాల్సి ఉండింది.
ఆ సమయంలో బేట్స్ సభకు ఆలస్యంగా వచ్చారు. లిస్టర్ అడిగిన ప్రశ్నను తెలుసుకుని, తన సీటు వద్దకు వచ్చి - సభకు ఆలస్యంగా వచ్చానని, దానికి సిగ్గుపడుతున్నానని, లిస్టర్‌కు క్షమాపణలు చెబుతున్నానని, ప్రధానికి తన రాజీనామా లేఖ సమర్పిస్తానని చెప్పి సభ నుంచి వెళ్లిపోయారు.
బేట్స్ తీరు లిస్టర్ కూడా ముక్కు మీద వేలేసుకున్నారు. ఆలస్యమైనందుకు క్షమాపణ చెప్తే సరిపోయేయదని, మంత్రి తీరు కాస్తా అతిగానే ఉందని అన్నారు. ఇది బేట్స్ ఆడిన డ్రామాగా లేబర్ పార్టీ నాయకులు అభివర్ణిస్తున్నారు. బేట్స్ రాజీనామాను తిరస్కరిస్తున్నట్లు హౌస్ ఆఫ్ లార్డ్స్ ఓ ప్రకటనలో తెలిపింది.