YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

లాలూను కేవలం ముగ్గురే కలవాలి

లాలూను  కేవలం ముగ్గురే  కలవాలి

‘సంక్రాంతి పండుగ వస్తోంది. మా ఇంట్లో దహీ చుర్రా (స్వీట్‌)తో చాలా అట్టహాసంగా పండుగ జరుపుకుంటాం. నన్ను కలవడానికి వారంలో కేవలం ముగ్గురికే అనుమతిస్తు్న్నారు. ఈ విషయం గురించి మరోసారి ఆలోచించండి. ఆ అధికారం‌ మీకు ఉంది.’ అని లాలూ న్యాయమూర్తితో అన్నారు.దాణా కుంభకోణం కేసులో బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కి మూడున్నరేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. కాగా.. లాలూను కలవడానికి వారానికి కేవలం ముగ్గురే రావాలని సీబీఐ న్యాయమూర్తి శివపాల్‌ సింగ్‌ ఆదేశించారు. ఈ విషయం గురించి పునరాలోచించాల్సిందిగా బుధవారం లాలూ.. న్యాయమూర్తిని కోరారు.ప్రస్తుతం లాలూ ఝార్ఖండ్‌లోని హజరిబాగ్‌ ప్రాంతంలో ఉన్న ఓపెన్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు ఇందుకు న్యాయమూర్తి దీటుగా సమాధానమిస్తూ..‘ఆ దహీ చుర్రా నీకు అందేలా చూస్తాను. కానీ ముగ్గురు విజిటర్లకు మించి లోనికి అనుమతించేది లేదు’ అన్నారు. ఇందుకు లాలూ..‘నేను న్యాయవాదిని. సుప్రీం, హైకోర్టులలో న్యాయవాదిగా నా పేరు నమోదై ఉంది. నా ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని శిక్ష వేస్తానని చెప్పారు. కానీ మూడున్నరేళ్లు జైలు శిక్ష విధించారు’ అన్నారు. దీనికి శివపాల్‌ సమాధానంగా..‘కానీ నువ్వు రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ సమర్పించలేదు. అందుకే నీకు మూడున్నరేళ్లు శిక్ష వేశాను’ అని తెలిపారు. ఇంతకుముందు కూడా లాలూ తనకు జైల్లో చలిగా ఉందని చెప్పడంతో న్యాయమూర్తి ‘చలేస్తే తబలా వాయించుకో’ అంటూ చురకలంటించిన విషయం తెలిసిందే.దాణా కుంభకోణంలో లాలూ జైలుకు వెళ్లడం ఇది ఎనిమిదో సారి. 

Related Posts