దివంగత కమ్యూనిస్టు నేత, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో కుమారుడు ఫిడెల్ క్యాస్ట్రో డియాజ్ బలార్ట్ (68) బలవన్మరణానికి పాల్పడ్డారు. గత కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నారు. 'డియాజ్ గత కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. కొన్ని నెలల నుంచి ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. అయినా తీవ్ర మనస్థాపంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో ఫిడెల్ క్యాస్ట్రో ఇంట విషాదం నెలకొంది.