- ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు
వరుణ్ తేజ్, రాశిఖన్నా హీరో హీరోయిన్లుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'తొలిప్రేమ' ట్రైలర్ విడుదలైంది. "ఙ్ఞాపకాలు మంచివైనా, చెడ్డవైనా మనతోనే ఉంటాయి. మోయక తప్పదు" అంటూ వరుణ్ చెప్పే డైలాగ్‌తో మొదలైన ట్రైలర్ చివరగా రాశిఖన్నా చెప్పే సేమ్ డైలాగ్‌తో ముగిసింది. ప్లజెంట్‌గా సాగిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటుండగా.. దీంతో సినిమాపై మరింత అంచనాలను పెంచేశాడు దర్శకుడు.
ఇక ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీని భోగవల్లి ప్రసాద్ నిర్మించగా.. తమన్ సంగీతాన్ని అందించాడు. గతేడాది 'ఫిదా'తో మంచి హిట్‌ను కొట్టిన వరుణ్ తేజ్.. ఈ మూవీతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.