శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ విషయమై తనపై చేసిన ఆరోపణలకు లారెన్స్ తాజాగా స్పందించారు.సోషల్ మీడియాలో ఓ ప్రెస్‌నోట్‌ను రిలీజ్ చేసారు. ‘‘హాయ్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్ నేను ట్రస్ట్‌ని ప్రారంభించి 13 సంవత్సరాలవుతోంది. మీ సపోర్ట్‌తో అది సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. మీ సపోర్ట్‌కి, బెస్లింగ్స్‌కి థాంక్స్. మరో విషయం ఏంటంటే, నేను శ్రీరెడ్డి విషయాన్ని క్లారిఫై చేయాలనుకుంటున్నాను. నేను రెబల్ మూవీ చేసి 7 సంవత్సరాలు పూర్తైంది. ఆమె 7 ఏళ్ల క్రితం ఈ ఇష్యూని ఎందుకు బయటపెట్టలేదు? సరే వదిలేయండి. ఆమె నా హోటల్ రూమ్‌కి వచ్చానని... అప్పుడు నేను ఆమెను మిస్ యూజ్ చేసుకున్నానని తెలిపింది. నా రూమ్‌లో దేవుడి ఫోటో, రుద్రాక్ష మాల కూడా చూశానని ఆమె చెప్పింది. హోటల్స్‌లో రుద్రాక్ష మాల పెట్టి పూజలు చేయడానికి నేనేమీ ఫూల్‌ని కాను. నేను శ్రీరెడ్డికి డైరెక్ట్‌గా చెబుతున్నా.. నేనే తప్పూ చేయలేదు ఆ విషయం నాకు తెలుసు.. ఆ భగవంతుడికి తెలుసు. నువ్వింత చేశాక కూడా నాకు నీపై కోపం రావట్లేదు. నీ ఇంటర్వ్యూస్ అన్నీ చూశాను.. నీపై జాలి కలుగుతోంది నాకు.... అంటూ ట్వీట్ చేశారు లారెన్స్.
Hi Friends and Fans..! it’s been 13 years since my trust started... because of your support it’s running successfully. thanks for your support and blessings.
— Raghava Lawrence (@offl_Lawrence) July 29, 2018
And one more thing ,
I want to clarify about Sri reddy issue???? pic.twitter.com/to6g43Osfm