నరేగా నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సోమవారం నాడు సమీక్ష నిర్వహించారు. శాఖలవారీగా, వారంవారం లక్ష్యాలను నిర్దేశించుకుని పనులను పూర్తిచేయాలని సూచించారు. సీసీ రహదారులు, అంగన్వాడీ భవనాల నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇకపై ఒక పంచాయతీలో అన్ని పాఠశాలల్లోనూ అభివృద్ధి పనులకు చంద్రబాబు అనుమతిచ్చారు. నరేగా నిధుల వినియోగిస్తున్న 22 శాఖలు స్పష్టమైన ప్రణాళికలు వచ్చేవారం నాటికి రూపొందించాలి. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున కేంద్రానికి సమర్పించేలా ఒక సవివర నివేదికను సిద్ధం చేయండని అయన సూచించారు. ఈ ఏడాది ‘రైతు రథం’ కింద 12 వేల ట్రాక్టర్లు రైతులకు అందించాలి. రైతులకు అవసరమైన స్ప్రేయర్లు, టార్పాలిన్లను కూడా పంపిణీ చేయండని అయన అన్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేయాలని చంద్రబాబు అన్నారు.