జట్టులో చోటివ్వలేదనే అక్కసుతో తనపై ఓ అథ్లెట్ లైంగిక దాడి ఆరోపణలు చేస్తున్నారని భారత అథ్లెటిక్ నయా సంచలనం హిమదాస్ కోచ్ నిపన్‌దాస్ అన్నాడు. ‘నేపై వస్తోన్న లైంగిక దాడి ఆరోపణలన్ని అవాస్తవమని పేర్కోన్నారు. అసోంలోని సరుస్‌జైయ్ స్టేడియంలోని శిక్షణ శిబిరంలో తనపై దాస్ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే శిక్షణ శిబిరం నుంచి తీసేస్తానని బెదిరించినట్లు ఓ బాధిత అథ్లెట్ ఆరోపించింది. దీనిపై ఆమె కుటుంబసభ్యులు ఈ నెల 22న పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివిధ సెక్షన్ల కింద పోలీసులు దాస్‌పై కేసులు నమోదు చేశారు.ఈ సందర్భంగా దాస్ మాట్లాడుతూ... నాపై ఈ ఆరోపణలు చేసిన అమ్మాయి ఇప్పుడు నా వద్దే కోచింగ్ తీసుకుంటోంది. ఒకవేళ నేను లైంగిక దాడికి పాల్పడినట్లు వస్తోన్న వార్తలు నిజం అని తేలితే నేను ఎలాంటి శిక్ష అయినా అనుభవించడానికి సిద్ధం. అవన్ని అబద్దాలని తేలితే నాపై ఈ ఆరోపణలు చేసిన ఆమెను కఠినంగా శిక్షించాలి. నేను చాలా మంచివాడిని. కావాలంటే నా స్టూడెంట్స్‌ను అడగొచ్చు. జూన్ 26-29 మధ్య గువాహాటిలో నేషనల్ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. 100 మీటర్లు, 200 మీటర్ల విభాగంలో నా వద్ద శిక్షణ తీసుకుంటున్న ఆమెను ఈ పోటీలకు ఎంపిక చేయలేదు. అది దృష్టిలో పెట్టుకునే ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తోంది. ఆమె కంటే మెరుగైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు నేను అవకాశం ఇచ్చాను. ఇందులో తప్పేముంది. మే 18న నేను ఆమెపై దాడికి పాల్పడినట్లు చెబుతోంది. మరి ఇన్నాళ్ల తర్వాత జులై 22న పోలీసులకు ఫిర్యాదు చేయడంలో అర్థం ఏమిటి. ఇప్పటి వరకు ఆమె పోలీసులకు ఎలాంటి ఆధారాలు అందించలేదు. నాతో పాటు అసిస్టెంట్ కోచ్, కొంతమంది క్రీడాకారులను పోలీసులు విచారించారు. వారంతా ఇలాంటిదేమీ జరగలేదనే చెప్పారు’ అని వివరించాడు నిపన్‌దాస్.