వెస్టిండీస్-బంగ్లాదేశ్ మధ్య ఆదివారం జరిగిన మూడో వన్డేలో గేల్ ఒక ఘనతను అందుకున్నాడు. వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ సిక్స్‌ల మోత మోగించాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాళ్ల జాబితాలో పాక్ ఆటగాడు షాహిద్ అఫ్రిదితో కలిసి అగ్రస్థానాన్ని పంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని అందుకునే క్రమంలో ఓపెనర్‌గా మైదానంలో అడుగుపెట్టిన గేల్ బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 66 బంతుల్లో 73 పరుగులు చేశాడు. ఇందుకు 5 సిక్స్‌లు, 6 ఫోర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు గేల్ అంతర్జాతీయ క్రికెట్లో నమోదు చేసిన సిక్స్‌ల సంఖ్య 476కు చేరింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్స్‌లు నమోదు చేసిన పాక్ ఆటగాడు షాహిద్ అఫ్రిది రికార్డను గేల్ సమం చేశాడు. ప్రస్తుతం వీరిద్దరూ 476 సిక్స్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.