సత్యమేవ జయతే’ సినిమాలో తమ మనోభావాలు దెబ్బతీసేవిధంగా సన్నివేశాలు ఉన్నాయని షియా వర్గానికి చెందిన ముస్లింలో ఆరోపిస్తు్న్నారు. దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు డీసీపీ తెలిపారు. జాన్ అబ్రహం, మనోజ్ బాజ్‌పేయ్ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ సినిమా ‘సత్యమేవ జయతే’. మిలాప్ జవేరీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘సత్యమేవ జయతే’ సినిమా ట్రైలర్‌పైనా అభ్యంతరాలు వచ్చాయి. ముస్లింలు పవిత్రంగా భావించే మొహర్రం ఊరేగింపును అగౌరవపరిచే విధంగా సన్నివేశం ఉందని, తమ మనోభావాలు దెబ్బతీసేవిధంగా ట్రైలర్‌లో చూపించారని షియా వర్గం ఆరోపిస్తోంది. సదరు సన్నివేశాలను వెంటనే తొలగించి సినిమా దర్శకుడు, హీరోపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాపై భాగ్యనగరంలో కేసు నమోదైంది. సినిమాలో జాన్ అబ్రహం సరసన అమృత ఖన్విల్కర్ నటించారు. ఇప్పటికే విడుదలపైన ఈ సినిమా ట్రైలర్‌కు, పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.