YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కంచుకోటలో కొత్త భయం

కంచుకోటలో కొత్త భయం
జిల్లా వైఎసీపీ ఎమ్మెల్యేలకు కొత్త భయం పట్టుకుంది.. మళ్లీ పోటీచేయడానికి వెనుకంజ వేస్తున్నారు.. టికెట్‌ ఇస్తానని జగన్‌ చెప్పినా ముందుకు రావడం లేదు.. అసలు ఎన్నికలంటేనే వణికిపోతున్నారు. 
ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయపార్టీలలో హడావుడి నెలకొనడం సర్వ సాధారణం.. రాష్ట్ర, జిల్లా పార్టీ కార్యాలయాలకు కళ వచ్చేస్తోంది.. టికెట్ల కోసం వచ్చిపోయే నేతలతో సందడిగా మారుతాయి..టికెట్‌ కోసం కోట్లు ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు.. అదేమిటో కానీ కడప జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీలో మాత్రం హడావుడే లేదు.. పైగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయట! వాస్తవానికి కడప జిల్లాకు సంబంధించినంత వరకు వచ్చే ఎన్నికల్లో సిట్టింగులకే మళ్లీ టికెట్లు ఇస్తానని జగన్ ప్రకటించారు.. ఈ ప్రకటన విని ఎగిరి గంతేయాల్సిన ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారట! వామ్మో... మళ్లీ నాకే టికెట్‌ ఇస్తారా అంటూ అదిరిపోతున్నారట! జగన్మోహన్‌రెడ్డికి రాజకీయ కంచుకోట అయిన కడప జిల్లాలో ఎందుకీ పరిస్థితి..? ఎన్నికలంటే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఎందుకంత భయం..? అంటే చాలా చెప్పాల్సి వస్తుంది.. క్లుప్తంగా చెప్పుకుంటే... ఎన్నికల ఖర్చును తల్చుకునే వారు వణికిపోతున్నారు. గత ఎన్నికల్లోనే అప్పు సప్పు చేసి ఎన్నికల బరిలో దిగామని.. భారీగా ఖర్చు పెట్టామని.. గెలిచిన సంబరం పట్టుమని పదినెలలు కూడా లేదని వైకాపా ఎమ్మెల్యేలు తమ ఆవేదనను వెలిబుచ్చారు.. తమ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఎన్నికల్లో పెట్టిన ఖర్చులో పదో వంతు కూడా సంపాదించుకోలేకపోయామని వాపోతున్నారట!
ఈ నాలుగేళ్లలో ఆర్ధికంగా బాగా చితికిపోయామని దీనస్వరంతో చెబుతున్నారట! గత ఎన్నికలకు చేసిన అప్పులే ఇంకా పూర్తిగా తీరలేదని.. ఇక మళ్లీ టికెట్‌ ఇస్తే ఎన్నికల ఖర్చులకు మొత్తం ఆస్తులను అమ్ముకోవాలని అంటున్నారట! ఒకవేళ మళ్లీ అప్పులు చేసి బరిలో దిగినా.. తమ ప్రభుత్వం వస్తుందన్న గ్యారంటీ లేదని సన్నిహితుల దగ్గర చెప్పుకుని బాధపడుతున్నారట! ఏం చేయడమా అని తెగ వర్రీ అవుతున్నారు.
కడప జిల్లాలో ఉన్న మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్క రాజంపేట నుంచి మాత్రమే తెలుగుదేశంపార్టీ గెలవగలిగింది.. మిగిలిన తొమ్మిది నియోజకవర్గాలలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీనే గెలిచింది. ఇప్పుడు కడప జిల్లాలో కూడా తెలుగుదేశంపార్టీ బాగా పుంజుకుంది.. జగన్‌ కంచుకోటను బద్దలు కొట్టేందుకు సంసిద్ధమవుతోంది.. వైకాపా ఎమ్మెల్యేలలో కొంత ఈ భయం కూడా ఉండవచ్చు.. పులివెందుల నుంచి ఎలాగూ జగన్మోహన్‌రెడ్డినే పోటీ చేస్తారు.. కడప నుంచి అమ్జాద్‌ బాష.. మైదుకూరు నుంచి రఘురామిరెడ్డి.. పొద్దుటూరు నుంచి రాచమల్లు ప్రసాద్‌రెడ్డి.. రైల్వే కోడూరు నుంచి శ్రీనివాసులు.. రాయచోటి నుంచి జి.శ్రీకాంత్‌రెడ్డి.... రాజంపేట నుంచి అమర్‌నాథ్‌రెడ్డి... కమలాపురం నుంచి పి.రవీంద్రనాథ్‌రెడ్డిలే మళ్లీ బరిలో దిగే అవకాశాలున్నాయి.. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి.. బద్వేల్‌ ఎమ్మెల్యే జయరాములు తెలుగుదేశంపార్టీలోకి వెళ్లడంతో ఆ రెండు చోట్ల కొత్తవారిని పోటీలో దింపనున్నారు. 

Related Posts