నెల్లూరు జిల్లాలో గ్రూపు తగాదాలతో తెలుగు దేశం పార్టీ రోడ్డున పడింది. సర్వేపల్లి నియోజకవర్గంలాగా, ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా నీరు- చెట్టు , ఇరిగేషన్ పనులలో కమీషన్లు దండుకోవడానికే సోమిరెడ్డి ఆలోచన అంతా అని సర్వేపల్లి వైకాపా ఎమ్మ్యేల్ల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి ఆరోపించారు. సోమిరెడ్డి ఆలోచన అంతా అవినీతి పైన తప్ప అభివృద్ధి పైన కాదు. కమిషన్లు దండుకోవడానికి ఎవరైన అడ్డుపడితే తన అనుచరులను జిల్లా కార్యాలయంలో దీక్షకు కూర్చోపెట్టడం సోమిరెడ్డి అవినీతికి పరకాష్ట. పొదలకూరు మండలం పై అవగాహన లేని కొందరు అభివృద్ధి చేశామంటూ భీకర ప్రకటనలు గుప్పిస్తున్నారు. పొదలకూరు మండలంలో 15,000 మెజారిటీ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కి సాధించలేకపోతే మనం గెలిచినా అది గెలుపు కింద లెక్క కాదని అన్నారు. సర్వేపల్లిలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ గెలుపు నల్లేరు మీదన నడకే, భారీ మెజారిటీ సాధించేందుకు ప్రయత్నం చేయాలి. సోమిరెడ్డికి సర్వేపల్లి నియోజకవర్గంలో మరొకసారి శ్రుంగ భంగం తప్పదు. సోమిరెడ్డికి ఓటమి కొత్తకాదు, సోమిరెడ్డిని నమ్ముకుంటే కార్యకర్తలు అన్యాయం అయిపోతారని అన్నారు. ఓడిపోవడం, సోమిరెడ్డి ఎవ్వరికీ కనిపించకుండా వెళ్ళిపోవడం అలవాటు చేసుకున్నాడని అయన విమర్శించారు.