- ‘నీకేమైనా పిచ్చి పట్టిందా..రాజ్యసభ వైస్ చైర్మన్
- సభను వాయిదా వేసిన కురియన్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడ్జెట్‌లో తమకు అన్యాయం జరిగిందని తెలుగు రాష్ట్రాల ఎంపీలు, మంత్రులు కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా శుక్రవారం రోజున రాజ్యసభలో ఎంపీలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.
ఏపీకి బడ్జెట్‌లో అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు రాజ్యసభలో నిరసన తెలిపారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ విస్మరిస్తున్నారంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎంపీ ‘సేవ్ ఆంధ్రప్రదేశ్ ప్లకార్డు’ ప్రదర్శించారు. ఏపీకి సాధారణ బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం చేశారని ఆయన నినాదాలతో హోరెత్తించారు. దీంతో రాజ్యసభ వైస్ చైర్మన్ పదేపదే ఆయన్ను కూర్చోమని చెప్పాల్సినంత పనైంది. అంతటితో ఆగని కేవీపీ వెల్‌లోకి దూసుకొచ్చారు. ఆగ్రహానికి లోనైన కురియన్ ‘నీకేమైనా పిచ్చి పట్టిందా సభలోంచి వెళ్లిపో’ అంటూ తీవ్రంగా మాట్లాడినా కేవీపీ మాత్రం తన నిరసనను విరమించలేదు. దీంతో విపక్షాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయడంతో కురియన్ రాజ్యసభను వాయిదా వేశారు.