YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అవిశ్వాస తీర్మానం పెట్టడం వల్లే ప్రతిపక్షాల అసత్యాలను బయటపెట్ట గలిగా కాంగ్రెస్‌కు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ

అవిశ్వాస తీర్మానం పెట్టడం వల్లే ప్రతిపక్షాల అసత్యాలను బయటపెట్ట గలిగా           కాంగ్రెస్‌కు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ
అవిశ్వాస తీర్మానం పెట్టడం వల్లే ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను బయటపెట్టే అవకాశం లభించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తమ ప్రభుత్వంపై ఇటీవల విశ్వాస తీర్మానం పెట్టడంపై కాంగ్రెస్‌కు ధన్యవాదాలు తెలిపారు.తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్‌కు ధన్యవాదాలు చెప్పారు.మంగళవారం భాజపా పార్లమెంటరీ సమావేశాని మోదీ హాజరై ప్రసంగించారు. అవిశ్వాస తీర్మానంలో నెగ్గడం భాజపాతో పాటు మిత్రపక్షాల విజయమని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం వారి రాజకీయ అపరిపక్వతను, అవగాహన లేమిని చూపుతోందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌ కుమార్‌ విమర్శించారు.ఈ సమావేశంలో భాజపా సీనియర్‌ నేతలు నితిన్‌ గడ్కరీ, సుష్మా స్వరాజ్‌, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాలు మోదీని సన్మానించినట్లు అనంత్‌ కుమార్‌ వెల్లడించారు. ‘ప్రభుత్వం మెజార్టీ కోల్పోయినప్పుడో, దేశంలో తీవ్రమైన అశాంతి నెలకొన్నప్పుడో అవిశ్వాసం పెడతారు.. కానీ ఇప్పుడు అవిశ్వాసం పెట్టడానికి అసలు ఎలాంటి కారణం లేదు. 326 ఓట్ల మెజార్టీతో అవిశ్వాస తీర్మానం నెగ్గాం’ అని అమిత్‌షా అన్నట్లు అనంత్‌కుమార్‌ చెప్పారు. సమావేశంలో మోదీ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను ప్రశంసించారని, అవిశ్వాసంపై రాజ్‌నాథ్ చేసిన ప్రసంగాన్ని మోదీ మెచ్చుకున్నారని, ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు వెల్లడించారు.

Related Posts