YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రమాణ స్వీకారానికి మోదీని ఆహ్వానించిన ఇమ్రాన్‌ఖాన్

ప్రమాణ స్వీకారానికి మోదీని ఆహ్వానించిన ఇమ్రాన్‌ఖాన్
పాకిస్థాన్ కాబోయే ప్రధానమంత్రి, పాకిస్థాన్ తెహ్రికె ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్‌ఖాన్ తన ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాల అధినేతలను ఆహ్వానించాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ నేత ఒకరు మంగళవారం వెల్లడించారు. భారత ప్రధాని మోదీకి కూడా ఆహ్వానం పంపనున్నట్లు ఆ నేత చెప్పారు. జులై 25న పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని పీటీఐ 115స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 22మంది సభ్యులు అవసరం. చిన్నాచితకా పార్టీలు  స్వతంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆగస్ట్ 11న తాను ప్రమాణస్వీకారం చేయనున్నట్లు కూడా ఇమ్రాన్ ప్రకటించారు.ఈ ప్రమాణస్వీకారోత్సవానికి పార్టీ కోర్ కమిటీ.. మోదీతోపాటు ఇతర సార్క్ దేశాధినేతలను ఆహ్వానించాలని భావిస్తున్నది. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని పార్టీకి చెందిన నేత వెల్లడించారు. మోదీ స్వయంగా ఫోన్ చేసి ఇమ్రాన్‌కు అభినందనలు తెలపడం కూడా రెండు దేశాల మధ్య కొత్త సంబంధాలకు తెర తీయడమే అవుతుందని ఆ నేత అభిప్రాయపడ్డారు. ‘ఇమ్రాన్‌ఖాన్‌ ప్రమాణస్వీకారానికి భారత ప్రధాని నరేంద్రమోదీ సహా సార్క్‌(అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, భారత్‌, నేపాల్‌, మాల్దీవులు, పాకిస్థాన్‌, శ్రీలంక) దేశాధినేతలను ఆహ్వానించాలని పీటీఐ కోర్‌ కమిటీ భావిస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం’ అని పీటీఐ నేత ఒకరు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఇమ్రాన్‌ఖాన్‌కు భారత ప్రధాని మోదీ ఫోన్‌ చేసి అభినందనలు తెలిపిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. విదేశాంగ శాఖతో సంప్రదించి దీనిపై పార్టీ రానున్న రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందని ఫవద్ స్పష్టంచేశారు. గ‌తంలో మోదీ కూడా త‌న ప్ర‌మాణ‌స్వీకారానికి సార్క్ దేశాధినేత‌ల‌ను ఆహ్వానించిన విష‌యం తెలిసిందే.
భారత్‌పై ఇమ్రాన్‌ ఖాన్‌ దృష్టి
పాక్‌ ఎన్నికల్లో విజయం సాధించిన ఇమ్రాన్‌ఖాన్‌కు భారత ప్రధాని మోదీ సోమవారం ఫోన్‌ చేశారు. ‘పాకిస్థాన్‌, భారత్‌ ద్వైపాక్షిక బంధంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు మేం సిద్ధంగా ఉన్నామని’ మోదీ ఇమ్రాన్‌ఖాన్‌తో అన్నారు. దీనికి ఇమ్రాన్‌ స్పందిస్తూ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల ఎన్నికల అనంతరం చేసిన ప్రసంగంలోనూ ఇమ్రాన్‌ఖాన్‌.. భారత్‌ గురించి ప్రస్తావించారు. భారత్‌, పాక్‌ మధ్య సత్సంబంధాలు రెండు దేశాలకు మంచివన్నారు. భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంటే ఆ దేశంతో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.2014లో భారత ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం చేశారు. దిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి అప్పటి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ హాజరయ్యారు. ఆ తర్వాత 2015 డిసెంబరులో నవాజ్‌షరీఫ్‌ పుట్టినరోజు సందర్భంగా విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని లాహోర్‌లో ఆగి షరీఫ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని అంతా భావించారు.అయితే ఆ తర్వాత 2016 నుంచి చోటుచేసుకుంటున్న ఘటనలతో భారత్‌, పాక్‌ మధ్య మళ్లీ సంబంధాలు బెడిసికొట్టాయి. 2016లో పాక్‌ చెందిన ఉగ్రవాద సంస్థలు భారత్‌లో దాడి చేయడం, భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌కు పాక్‌ మరణశిక్ష విధించడంతో ఇరు దేశాల విభేదాలకు మళ్లీ ఆజ్యం పోసినట్లయింది. ఇలాంటి నేపథ్యంలో ప్రధాని మోదీని ఇమ్రాన్‌ఖాన్‌ ఆహ్వానించాలనుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.జుల్‌ 25న జరిగిన పాక్‌ ఎన్నికల్లో పీటీఐ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. దీంతో ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అవసరమైన మెజార్టీ పీటీఐకు లేకపోవడంతో చిన్నపార్టీలు, స్వతంత్రుల మద్దతుకోసం చర్చలు జరుపుతున్నారు.

Related Posts