YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తనపై లేనిపోని కేసులు బనాయించి జైల్లో పెట్టాలని చూస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా

తనపై లేనిపోని కేసులు బనాయించి జైల్లో పెట్టాలని చూస్తున్నారు                               వైసీపీ ఎమ్మెల్యే రోజా
తనపై లేనిపోని కేసులు బనాయించి, తనను జైల్లో పెట్టాలని చూస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. చిత్తూరు జిల్లా నగరిలో రోజాపై పోలీస్ కేసు నమోదై కావడంపై ఆమె స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసు వ్యవహారం ఎస్పీ స్థాయిలో లేదని, చంద్రబాబు, లోకేష్ లు దీనిపై శ్రద్ధ పెట్టారని, ఎలాగైనా సరే, తనను లోపల పెట్టాలన్న ఆలోచనలో వారు ఉన్నారన్న సమాచారం తమకు తెలిసిందని అన్నారు. గతంలో కాల్ మనీ - సెక్స్ రాకెట్ వ్యవహారంపై అసెంబ్లీలో గట్టిగా నిలదీసినందుకు నిర్దాక్షణ్యంగా తనను సస్పెండ్ చేసిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ‘నా ప్రాణం పోయేంత వరకూ నా పోరాటం ఆపను. నన్ను ఎంత తొక్కితే అంత ఎదుగుతాను. మహిళల సమస్యలపై గళం విప్పుతాను అని చంద్రబాబునాయుడికి చెబుతున్నా’ అని రోజా అన్నారు.

Related Posts