ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం. వాహన సేవలును రాత్రి 8 గంటలకే ప్రారంభిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. మంగళవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 13 వ తేదిన రాష్ర్ట ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీవారికి పట్టివస్ర్తాలు సమర్పిస్తారు. సెప్టెంబర్ 13 నుండి 22 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 10 నుండి 18 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని అయన అన్నారు. ఆగష్టు 31 వ తేదిలోపు ఇంజనీరింగ్ పనులును పూర్తి చేస్తాం. భక్తులు సౌకర్యార్ధం తిరుమలలో 26 కోట్ల వ్యయంతో 512 టాయిలెట్స్ నిర్మించనున్నట్లు అయన అన్నారు. ఇందుకు గాను 700 సిబ్బందిని అదనంగా నియమిస్తూన్నాం. ఘాట్ రోడ్డులో 6500 ట్రిప్పులును ఆర్టిసి బస్సులు నడిపేలా ఏర్పాట్లు వుంటాయి. 4 వేల మంది పోలీసులతో గరుడ సేవ రోజు భధ్రతా ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తారు. గరుడ సేవ రోజు ద్విచక్ర వాహనాలును అనుమతించం. బ్రహ్మోత్సవాలు సందర్భంగా 7 లక్షల లడ్డులును నిల్వ వుంచుతాం. ఎన్డి ఆర్ ఏఫ్ టీం సేవలును బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఉమయోగించుకుంటాంమని అన్నారు. వాహన సేవలను ప్రత్యక్షంగా విక్షించేందుకు భక్తులు సౌకర్యార్ధం 31 ఎల్ ఈ డీ స్ర్కీన్స్ ఏర్పాటు చేస్తాంమని ఈవో అన్నారు.