- సమ్మక్క-సారలమ్మలకు కేసీఆర్ పూజలు
- మొక్కులు చెల్లించుకున్న కేసీర్ దంపతులు
మేడారం దేవతలు సమ్మక్క-సారలమ్మలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా దర్శించుకున్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం కోసం మొక్కుకున్నానని.. ఆ కోరిక నెరవేరడంతో ఇప్పుడు మొక్కులు తీర్చుకునేందుకు వచ్చానని కేసీఆర్ ఈ సందర్భంగా అన్నారు. కోటిన్నర మంది ప్రజలు పాల్గొనే జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అని, దక్షిణ భారత కుంభమేళా అని ఆయన కొనియాడారు. ఇక రాబోయే మేడారం జాతర కనీవిని ఎరగని రీతులో చేస్తామని.. అందుకోసం ఈ బడ్జెట్‌లో 200కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పారు. అయితే రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం హోదాలో మేడారం జాతరకు కేసీఆర్ వెళ్లడం ఇదే తొలిసారి.