అత్యాధునిక హంగులతో రాజధాని అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రూపొందుతోంది. ఈ క్రికెట్ స్టేడియం భవిష్యత్తులో, అమరావతికి ఒక కలికితురాయి కానుంది. అమరావతి టౌన్-షిప్ లో, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 22 ఎకరాల్లో స్టేడియం నులు జోరుగా సాగుతున్నాయి. 2000వ సంవత్సరంలో స్టేడియం నిర్మించాలి అని తలిచినా, 2010 వరకు నిర్మాణం ప్రారంభం కాలేదు. అప్పటి నుంచి పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత, పనుల్లో వేగం పుంజుకుంది. 2018 చివరి నాటికి, పూర్తి చెయ్యాలి అనే సంకల్పంతో పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే గ్రౌండ్ సిద్ధం అయ్యింది. స్టేడియం గ్యాలరీ, గదులు మొదలగు పనులు జరుగుతున్నాయి.ఆగస్టు మూడోవారం నుంచి స్టేడియంలో రూ.కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పించేందుకే ఏసీఏ ప్రయత్నిస్తోంది. సీలింగ్‌లు, ఎయిర్ కండిషనింగ్, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్‌మెంట్స్, వివిధ గ్యాలరీ బాక్సుల మధ్య రెయిలింగ్, షట్టరింగ్స్, కోలాప్సబుల్ గేట్ల వంటివాటిని ఏర్పాటు చేస్తారు. ఈ ఫినిషింగ్ వర్కులతో పాటు స్టేడియం వెలుపల పక్క రోడ్లు, డ్రెయిన్లు, ఇవిగాక స్టేడియంలో మొత్తం ఏడు వేర్వేరు ప్రాంతాల్లో నాలుగువేల అడుగుల ఎత్తువరకు లిఫ్టులు ఏర్పాటు చేస్తారు. వచ్చే డిసెంబరు నాటికి స్టేడియంలో ట్రయల్ మ్యాచ్‌లను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది రాష్ట్ర స్థాయి మ్యాచ్‌లను నిర్వహించాలనుకుంటున్నారు. 2020 నాటికి అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు. 23.20 ఎకరాల విస్తీర్ణంలో స్టేడియం... 180 గజాల వ్యాసంలో ఉండే మైదానం మధ్య నుంచి బౌండరీ లైను 75 గజాల వ్యాసార్థంలో ఏర్పాటవుతోంది.. గ్రౌండు చుట్టూ ఉండే అండర్‌గ్రౌండు డ్రెయినేజికి, బౌండరీలైనుకు మధ్య మళ్లీ 15 గజాల జాగా ఉంటుంది.. మైదానంలో మొత్తం 11 పిచ్‌లను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ పిచ్‌లు ఒక్కోటి 66 అడుగుల పొడవు, పదడుగుల వెడల్పుతో ఉంటాయి.. అత్యాధునిక సాట్రమ్ వాటర్ డ్రెయిన్లతో, దాదపు 10 వేల లీటర్ల నీటిని బయటకు పంపే సామర్ధ్యం.. 34 వేల మంది ప్రేక్షకులు కూర్చొనేందుకు గ్యాలరీ.. 5 కోట్లతో నిర్మించిన ఇండోర్ స్టేడియం.. మొత్తం ఖర్చు రూ.120 కోట్లు