మాట తప్పను, మడం తిప్పను అంటాడు... నోరు తెరిస్తే చేసేది ఇదే... సరిగ్గా రెండు రోజుల క్రితం, కాపు రిజర్వేషన్ల అంశంలో జగన్ ఏమి అన్నాడు ? రాష్ట్ర రాజాకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు వచ్చాయో చూసాం. తాను మాట ఇస్తే అదే మాట మీద నిలబడతానని, చేయగలిగింది మాత్రమే చెబుతానని, చేయలేనిది చేస్తానని చెప్పే అలవాటు తనకు లేదని రెండు రోజుల క్రితం జగన్ చెప్పిన మాటలు విన్నాం. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తూ, ''ఇక్కడ కాపు సోదరులు అందరికీ చెబుతున్నా. కొన్ని అంశాలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి. మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలు ఉంటాయి. అటువంటిదే ఈ రిజర్వేషన్ల అంశం. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదన్న సుప్రీంకోర్టు తీర్పున్న పరిస్థితుల్లో ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలు. ఇది నేను చేయగలిగిన అంశం కాదు కాబట్టి నేను ఇది చేయలేకపోతున్నానని మీ అందరికీ ఏ మాత్రం మొహమాటం లేకుండా చెబుతున్నాను'' అని జగన్ అన్నారు.దీంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు మొదలయ్యాయి, జగన్ పాదయాత్రలో కాపు యువత జగన్ ముందు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ కాపు ప్రజలు, నాయకులు జగన్‌కు నిరసన తెలిపారు. కాపు రిజర్వేషన్లకు మద్దతుగా నిలబడి పోరాడాలని డిమాండ్ చేశారు. కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్ వైఖరిలో మార్పు రాకపోతే ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కాపు నాయకులు స్పష్టం చేశారు. కాపుల ఆందోళన చూస్తూ ఉంటే తన పాదయాత్ర ముగించే వరకు ఆ సామాజిక వర్గం నుంచి నిరసనలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో జగన్ వెనక్కు తగ్గారు.మడం తిప్పని మహా నేతను అని చెప్పుకునే జగన్, రెండే రెండు రోజుల్లో మడం తిప్పారు. జగన్ వ్యఖ్యలను సమర్ధిస్తూ, సాక్షిలో వచ్చిన కధనాలు ఇక చెత్త కుప్పలో వేసుకోవాలి, అంతలా యుటర్న్ తీసుకున్నాడు జగన్. ఈ రోజు, తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ జగ్గంపేట బహిరంగసభలో కాపు రిజర్వేషన్లపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, దీనిలో చంద్రబాబు పాపం ఉందని, ఎల్లో మీడియా కుట్ర అని అన్నారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపు రిజర్వేషన్లకు తమ పార్టీ మద్దతు యిస్తోందని, ఈ విషయంలో సలహాలిస్తే స్వీకరిస్తానని అన్నారు. యూటర్న్ తీసుకునే అలవాటు తమ ఇంటావంటా లేదని, ఎల్లో మీడియా మద్దతు ఉందని బాబు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.