YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పనులు ఆగకుండా చూడాలి అధికారులతో సీఎం చంద్రబాబు

పనులు ఆగకుండా చూడాలి అధికారులతో సీఎం చంద్రబాబు
బుధవారం తో పంచాయతి సర్పంచ్ ల పదవి కాలం ముగుస్తుండటంతో అందుకు అనుగుణంగా ప్రతి పంచాయతికి ప్రత్యేక అధికారులను నియమించాలని సియం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సియం అనంతపురం పర్యటనకు వెళ్లే ముందు  గ్రామదర్శనిపై అధికారులతో సియం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామీణాభివృద్ది, పంచాయితీరాజ్, సీఎంవో అధికారులు టెలికాన్ఫరెన్స్ లో పాల్గోన్నారు.. సర్పంచుల పదవీకాలం ముగిసినా పనులు ఆగకుండా చూడాలని సియం అధికారులను కోరారు. ప్రతి గురు,శుక్రవారాల్లో గ్రామాల్లో అధికారులు పర్యటించాలని  సియం అధికారులను అదేశించారు. ఇప్పటి వరకు కొందరు సర్పంచులు సహకరించారు. మరికొందరు సర్పంచులు సహకరించలేదు గ్రామాల్లో అందరినీ కలుపుకు పోవాలిని అందరితో సమన్వయంగా పనిచేయాలని సూచించారు. నాలుగేళ్లుగా గ్రామాల్లో అనేక పనులు జరుగుతున్నాయన్న సియం పనుల వేగం మరింతగా పుంజుకోవాలన్నారు. గ్రామ దర్శని అన్నిగ్రామాల్లో పకడ్బందీగా జరుగుతోంది. దీనిని మరింత ఉత్సాహంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అధికారులను కోరారు. గ్రామాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి. వాటిని బట్టి మండల, నియోజకవర్గ ప్రణాళికలు తయారు చేయాలన్నారు.. ప్రతి పథకం, కార్యక్రమంపై ప్రజల్లో సంతృప్తిశాతం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామన్నారు సియం.. అంతేకాకుండా పెన్షన్ల పంపిణి, రేషన్ పంపిణీ, ఇళ్ల బిల్లుల మంజూరు అన్నింటిలో ప్రజల్లో సంతృప్తి  తెలసుకుంటున్నామన్నారు. అభివృద్ది, సంక్షేమంలో గ్రామాల మధ్య పోటీతత్వం నెలకొంది. పోటితత్వం వల్ల మెరుగైన ఫలితాలు సాధిస్తామన్నారు.. విశాఖ జిల్లా గుడివాడ గ్రామం చూడచక్కగా ఉంది. సిమెంట్ రోడ్లు, పచ్చని చెట్లతో గేటెడ్ కమ్యూనిటిని తలపించిందన్నారు. అందంగా రూపొందిన గ్రామాలకు క్షేత్ర పర్యటనలు ప్రోత్సహించాలన్నారు.. మౌలిక సదుపాయాల్లో గ్రామాలు ఒకాదానితో మరొకటి పోటిపడాలన్నారు. ప్రజాదరణే కొలమానంగా అధికార యంత్రాంగం పనిచేయాలని అధికారులను సియం కోరారు.

Related Posts