ఉన్నత విద్య ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. పరీక్షా విధానం, సిలబస్‌లో మార్పులేమి లేవు. ఇదివరకు ఉన్న విధంగానే పరీక్ష నిర్వహణ జరగనుంది. పరీక్ష ఫీజులో సైతం మార్పులేమి లేవు. క్రితంసారి ఉన్న విధంగానే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పోటీ పరీక్షలను ఈ విద్యా సంవత్సరం నుంచి ఏడాదికి రెండు పర్యాయాలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. జేఈఈ(మెయిన్), నీట్(యూజీ)లను సంవత్సరానికి రెండు సార్లు నిర్వహించనున్నారు. ఈ సదవకాశం విద్యార్థులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉండనుంది. పరీక్షల నిర్వహణ అంతా ఆన్‌లైన్‌లోనే జరగనుంది. పరీక్షా షెడ్యూల్ విధానం ఈ విధంగా ఉంది.
1.యూజీసీ-నెట్..డిసెంబర్‌లో నిర్వహణ. 01 సెప్టెంబర్ 2018నుంచి30 సెప్టెంబర్ 2018వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించవచ్చు.
02 డిసెంబర్ 2018 నుంచి16డిసెంబర్ 2018మధ్యకాలంలో రెండు షిప్టుల్లో శని, ఆదివారాల్లో పరీక్ష నిర్వహణ.
2019 జనవరి చివరివారంలో ఫలితాల వెల్లడి.
2.జేఈఈ(మెయిన్)..జనవరిలో 2019 ఏప్రిల్2019లో పరీక్ష నిర్వహణ.
ఏ) జనవరిలో నిర్వహించే పరీక్ష షెడ్యూల్..
09సెప్టెంబర్ 2018 నుంచి30 సెప్టెంబర్ 2018 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణ
06 జనవరి 2019నుంచి 20 జనవరి2019 మధ్యకాలంలో ఎనిమిది విడతల్లో నిర్వహించే పరీక్షకు అభ్యర్థులు ఏ తేదీనైనా ఎంపిక చేసుకోవచ్చు
2019 ఫిబ్రవరి మొదటివారంలో ఫలితాల వెల్లడి
బి) ఏప్రిల్‌లో నిర్వహించే పరీక్ష షెడ్యూల్..
2019 ఫిబ్రవరి రెండోవారంలో దరఖాస్తుల సమర్పణ
07 ఏప్రిల్ 2019 నుంచి 21 ఏప్రిల్ 2019 మధ్యకాలంలో ఎనిమిది విడతల్లో నిర్వహించే పరీక్షకు అభ్యర్థులు ఏ తేదీనైనా ఎంపిక చేసుకుని పరీక్షకు హాజరుకావచ్చు
2019 మే నెల మొదటివారంలో ఫలితాల వెల్లడి.
3 నీట్(యూజీ)..ఫిబ్రవరి 2019 మే 2019 పరీక్ష నిర్వహణ
ఎ). ఫిబ్రవరి 2019 పరీక్ష
01అక్టోబర్ 2018 నుంచి31 అక్టోబర్,2018వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ
03 ఫిబ్రవరి 2019 నుంచి 17ఫిబ్రవరి 2019మధ్యకాలంలో పరీక్ష నిర్వహణ
2019మార్చి మొదటివారంలో ఫలితాల వెల్లడి
బి). మే2019పరీక్ష