YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కడప లో స్టీల్ ప్లాంట్ దిశగా అడుగులు

కడప లో స్టీల్ ప్లాంట్ దిశగా అడుగులు
విభజన‌ చట్టం అమలు, కడప స్టీల్‌ ప్లాంట్ అంశాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు.ఎంపీ సీఎం రమేష్ ఆధ్వర్యంలో కడప జిల్లా నేతలు రాష్ట్రపతిని కలుసుకున్నారు. అనంతరం సీఎం రమేష్ మాట్లాడుతూ కడప స్టీల్ ప్లాంట్ అంశం చట్టంలో ఉంది కదా..ఇబ్బంది ఏంటి అని రాష్ట్రపతి అడిగారన్నారు. ఉక్కుపరిశ్రమ కోసం దీక్ష చేయడం తన దృష్టికి వచ్చిందని రాష్ట్రపతి చెప్పారని అన్నారు. స్టీల్ ప్లాంట్ సాధ్యాసాధ్యాలపై నివేదిక కూడా వచ్చిందని, ఇక ప్రధాని అనుమతి ఇవ్వాలని చెప్పామని సీఎం రమేష్‌ తెలిపారు.విభజన హామీలపై పోరాటాన్ని ఉధృతం చేసింది టీడీపీ. ఇప్పటి వరకు పార్లమెంట్‌లో నిరసనను తెలియజేస్తున్న ఎంపీలు.. కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇవాళ కడప జిల్లా నేతలతో కలిసి రాష్ట్రపతిని కలిసి.. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై చర్చించారు. విభజన చట్టంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రస్తావించారని.. అయినా కేంద్రం మాత్రం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని నేతలు ఫిర్యాదు చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకునేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై ఓ నివేదికను కూడా కోవింద్‌కు అందజేశారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఆవశ్యకతను రాష్ట్రపతికి వివరించామన్నారు టీడీపీ ఎంపీలు. కోవింద్ కూడా సానుకూలంగా స్పందించారని.. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారని తెలిపారు. ఉక్కు పరిశ్రమకు భూములతో పాటూ అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. అయినా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రాష్ట్రపతికి వివరించామన్నారు. అలాగే విభజన హామీల విషయాన్ని కూడా ప్రస్తావించామని చెప్పుకొచ్చారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌తో తెదేపా ప్రతినిధుల బృందం భేటీ అయ్యింది. ఆ పార్టీ ఎంపీలు, కడప జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు కేంద్రమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు.అంతకుముందు ఇదే అంశంపై టీడీపీ బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసింది. ఉక్కు కర్మాగారంపై చర్యలు తీసుకునేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ విన్నవించింది. ఉక్కు కర్మాగారం ఆంధ్రుల మనోభావాలకు చెందిన అంశం కాబట్టి ఆ హామీ నెరవేరేలా చర్యలు తీసుకోవాలని నేతలు కోరారు.అంతకముందు కూడా టీడీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేశారు. గాంధీ విగ్రహం దగ్గర ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నింటినీ అమలు చేయాలంటూ నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. 

Related Posts