YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎవరూ ధీమాకుపోవద్దు..

ఎవరూ ధీమాకుపోవద్దు..

బీజేపీ నుంచి బయటికొస్తే..

- కావాల్సినవి అడిగేవారెవరున్నారని చంద్రబాబు వ్యాఖ్య

"రాజస్థాన్‌లో మూడు బీజేపీ సిట్టింగ్ సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. మనం కూడా జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరూ ధీమాకు పోవద్దు జాగ్రత్తగా ఉండాలి" అని నేతలకు సీఎం చంద్రబాబు వివరించారు. శుక్రవారం మధ్యాహ్నం ఏపీ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. బడ్జెట్‌లో ఏపీకి మొండిచేయి చూపడంతో కేటాయింపులు, బీజేపీతో వ్యవహారించాల్సిన తీరుపై సమావేశంలో నిశితంగా చర్చిస్తున్నారు. 

 మేం బీజేపీ నుంచి బయటికొస్తే కావాల్సినవి అడిగేవారెవరున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 
"విభజన సమయంలో బీజేపీ ముఖ్య నేతలందరిని కలిశాను. నాతో చర్చించేవారే తప్ప బహిరంగంగా పనిచేయలేదు. మోదుగుల, నామాలాంటి వారిపై దాడులకు తెగబ్డారు. పెద్దమ్మనే కాదు చిన్నమ్మను కూడా గుర్తుంచుకోవాలి అన్నారే తప్ప ఏపీకి జరుగుతున్న అన్యాయం మాత్రం చర్చించలేదు. రాజ్యసభలో మాత్రం ప్రత్యేకహోదా కోసం వెంకయ్య పట్టుబట్టి వదిలేశారు. ఆనాడు టీడీపీ ఎంపీల నిరసనను కూడా పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన సమయంలో కేసీఆర్ స్పష్టంగా తన అభిప్రాయం చెప్పారు. నేను మాత్రం రెండు రాష్ట్రాలకు సమన్యాయం చేయాలని కోరాను. జగన్ మాత్రం స్పష్టమైన వైఖరి చెప్పకుండా తప్పించుకున్నారు" అని విభజన నాటి విషయాలను ఆయన టీడీపీ నేతలకు వివరించారు.


"బడ్జెట్‌ కేటాయింపులపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. బడ్జెట్ చూసిన తర్వాత ఎంపీలందరూ బాధపడ్డారు. బడ్జెట్లో కర్ణాటక, మహారాష్ట్రకు అధిక ప్రాధాన్యమిచ్చారు. కొత్తగా ఏర్పాటైన ఏపీకి మాత్రం ఎలాంటి కేటాయింపులు లేవు. అన్ని రాష్ట్రాలకు సమానంగా ఇస్తే ఏ బాధ ఉండేదికాదు. కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాలకు వస్తున్నట్లు మనకూ వస్తున్నాయి. ఏపీని ఆదుకోవడానికి ప్రత్యేకంగా ఏం ఇచ్చారు?. బీజేపీ నేతలు కేంద్రం నుంచి కొత్తగా ఏం తెచ్చారో చెప్పాలి. మమ్మల్ని విమర్శించే ప్రతిపక్షం ఏం చేస్తుందో చెప్పాలి. సొంత మీడియాలో ఇష్టానుసారంగా తప్పుడు కథనాలు రాస్తున్నారు ఇది పద్ధతి కాదు. మీడియా అంతా ఏపీకి అన్యాయం జరిగిందని ప్రస్తావిస్తే సాక్షి మాత్రం టీడీపీ వల్లే ఏపీకి అన్యాయమని రాసింది" అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Related Posts