ఇళయ రాజా కుమారుడు ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా త్వరలో దర్శకుడిగా మారనున్నాడు. దీని గురించి యువన్ చెబుతూ, 'అవును, త్వరలో దర్శకత్వం చేయబోతున్నాను. ప్రస్తుతం స్క్రిప్ట్ పని చేసుకుంటున్నాను' అని చెప్పాడు. తాజాగా ఈయన నిర్మాతగా మారి 'ప్యార్ ప్రేమ కాదల్' పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తెలుగు,తమిళ బాషలలో హిట్ చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చినా యువన్ దర్శకుడిగా ఏ మాత్రం విజయం సాధిస్తాడా చూడాలి.