YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మమత తప్ప...మిగతా వాళ్ల సంగతేంటి...

 మమత తప్ప...మిగతా వాళ్ల సంగతేంటి...
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఉన్నంత దూకుడు విపక్ష నేతల్లో మరెవరూ కన్పించడం లేదు. మమతలో కన్పించిన కసి వేరెవరిలో లేదు. విపక్ష పార్టీల్లో పట్టున్న నేతలే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, మాయావతి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఏపీ 
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి వారు తమ రాష్ట్ర రాజకీయాలకే ఎక్కువగా పరిమితమవుతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుకు వీరు చేసే ప్రయత్నాలు పెద్దగా కన్పించడం లేదు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి నాళ్లలో బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. అనేక మంది నేతలను కూడా కలిశారు. మమతబెనర్జీ, దేవెగౌడ, అఖిలేష్ యాదవ్ వంటి నేతలను కలిశారు. ఆ తర్వాత ఇటీవల జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఆయనకు బీజేపీ అనుకూల వైఖరిని అవలంబించారన్న విమర్శ ఉంది. అలాగే రాష్ట్రంలో కేసీఆర్ పార్టీకి ప్రధాన శత్రువు కాంగ్రెస్ కావడంతో ఆయన ఆ పార్టీతో కలపి ఉన్న ఫ్రంట్ తో కలసి నడిచే ప్రసక్తి ఉండదు. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన రాష్ట్ర రాజకీయాలకే పరిమితమయ్యారు. జాతీయ రాజకీయాలపై దృష్టి సారించాలని ఉన్నప్పటికీ, వచ్చే ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో చంద్రబాబు పెద్దగా జాతీయ రాజకీయాలపై దృష్టి సారించడం లేదు.కుమారస్వామిది కూడా అదే తంతు. ఆయన సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన కాంగ్రెస్ తో ఆయన ఇబ్బంది పడుతున్నారు. జాతీయ రాజకీయాలు చేసేంత 
ఓపిక, సమయం కుమారస్వామికి లేవు. ఇక మాయావతి, అఖిలేష్ యాదవ్ లు సొంత రాష్ట్రానికే పరిమితమయ్యారు. మాయావతి జాతీయ రాజకీయాల్లో చురుగ్గు పోషించాలని భావిస్తున్నప్పటికీ ఆమె చొరవ తీసుకుని ఎవరి వద్దకు వెళ్లడం లేదు. తాను కోరుకుంటున్న ప్రధాని పదవే తన దరికి వస్తుందని మాయా ఆశిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుపై వెళదామనుకుంటున్న మాయావతికి మొదట్లోనే తేడా కొట్టడంతో ఆమె ప్రస్తుతం మౌనంగానే ఉన్నారు.ఇక తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమత బెనర్జీ మాత్రం బీజేపీ అంటేనే మండిపడుతున్నారు. ఎస్సార్సీ విషయంలో మమత ఫైరయినట్లు ఎవరూ కాలేదు. దేశంలో రక్తపాతం సృష్టించడానికి బీజేపీ కంకణం కట్టుకుందని తూలనాడారు. వచ్చే ఏడాది జనవరి 19వ తేదీన మమత కోల్ కత్తాలో భారీ ర్యాలీ 
చేపట్టనున్నారు. ఈ ర్యాలీకి విపక్షనేతలను ఆహ్వానించడానికి ఆమె మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. బీజేపీని, మోడీని ఎదుర్కొనాలంటే విపక్షాలన్నీ ఐక్యతగా కొనసాగాలని మమత తీవ్ర ప్రయత్నమే చేస్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో పాటు వివిధ నేతలను కలసి ఆమె ర్యాలీకి రావాలని కోరారు. సో…విపక్ష నేతల్లో మమత ఒక్కరే కొంత కమలం పార్టీపై కారాలు మిరియాలు నూరుతున్నట్లు కన్పిస్తున్నారు. మిగిలిన నేతలు మాత్రం తమ రాష్ట్ర సమస్యలతో సతమతమవుతున్నారు. మరి మమత ప్రయత్నాలు సఫలమవుతాయో…? లేదో? చూడాలి.

Related Posts