న్యూరోఎండోక్రిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నాడు బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్. తాజాగా అయన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మట్లాడుతూ.. ‘‘నేను బతికేది మరికొన్ని నెలలు మాత్రమే. ఈ విషయాన్ని నా మెదడు నాకు నిత్యం చెబుతోంది. కొన్ని నెలలు, లేదంటే ఏడాది.. మహా అయితే రెండేళ్లు బతుకుతాను కావచ్చు. ఇకపై ఇటువంటి వ్యాఖ్యలను కట్టిపెట్టేస్తాను. నాకున్న జీవితాన్ని హ్యాపీగా అనుభవిస్తాను’’ అని ఇర్ఫాన్ పేర్కొన్నాడు.