- భారత్‌లో బిట్‌కాయిన్ విలువ పడిపోయింది
- దేశంలో ట్రేడింగ్ విపరీతంగా పెరిగిందంటున్న ఆశిష్ అగర్వాల్
భారత్‌లో బిట్‌కాయిన్ సహా ఏ క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదని.. వాటిని ఎవరూ వినియోగించకుండా అన్ని చర్యలూ తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే భారత్‌లో బిట్‌కాయిన్ విలువ పడిపోవడం గమనార్హం. శుక్రవారం మధ్యాహ్నం 1.05గంటకు బిట్‌కాయిన్ విలువ రూ.5,44,735 వద్ద ట్రేడవుతోంది. బిట్‌కాయిన్ విలువ 15శాతం పడిపోయి రెండు నెలల కనిష్ఠానికి చేరినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. గతంలో దీని విలువ రూ.6,44,042 ఉంది.
బిట్‌సాచ్ క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ వ్యవస్థాపకుడు ఆశిష్ అగర్వాల్ దీనిపై స్పందించారు. బిట్‌కాయిన్ చట్టబద్ధం కాదని జైట్లీ చెప్పడం వల్ల పెట్టుబడిదారుల్లో భయం నెలకొందని ఆయన తెలిపారు. గురువారం బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ మాట్లాడుతూ భారత్‌లో వూహాజనిత కరెన్సీలను నిర్వహించేందుకు ఆర్‌బీఐ ఎలాంటి లైసెన్సులు ఇవ్వలేదని తెలిపారు. ఇటీవల కాలంలో దేశంలో బిట్‌కాయిన్ ట్రేడింగ్ విపరీతంగా పెరిగిపోయింది.