YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

లోకేషే...లక్ష్యంగా దాడి

లోకేషే...లక్ష్యంగా దాడి
ఏమి చేసినా చేయలేదు పొమ్మంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు అన్ని టిడిపి ఖాతాలో బురద మాత్రం తమకు అంటించేస్తున్నారు అని భావిస్తుంది బిజెపి. టిడిపి వ్యూహంతో కమలనాధులు తీవ్రంగా కలత చెందుతున్నారు. ప్రజల్లో బిజెపిని దోషిగా నిలబెట్టే టిడిపి ప్రయత్నాలను విజయవంతంగా తిప్పి కొట్టడానికి సుదీర్ఘ కసరత్తే మొదలు పెట్టేశారు బిజెపి రాష్ట్ర నేతలు. అందులో భాగంగా అమరావతిలో భేటీ అయిన బిజెపి సీనియర్ నేతలు రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అనుసరించాలిసిన వ్యూహానికి పదును పెట్టారు.రాష్ట్రానికి బిజెపి చేసిన ఉపకారాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కమలం పార్టీ సిద్ధమైంది. అలాగే విభజన హామీలు, ప్రత్యేక హోదా, ప్యాకేజి అంశాలు సవివరంగా ప్రజలకు తెలియచేయాలని బిజెపి నిర్ణయించింది. ముఖ్యంగా పోలవరం క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకోవడం ఎలా అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించింది కాషాయదళం. ప్రాజెక్ట్ కి ఖర్చు చేసే ప్రతిరూపాయి తాము ఇస్తున్న సంగతిని జనంలోకి తేవాలని వారు భావిస్తున్నారు. దాంతో బాటు టిడిపి అవినీతిపై పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు పార్టీ శ్రేణులను ఆదేశించారు కమలం నేతలు.ముఖ్యమంత్రి తనయుడు గ్రామీణాభివృద్ధి ఐటి మంత్రి లోకేష్ పై బిజెపి అస్త్రాలు ఎక్కుపెట్టినట్లు కనిపిస్తుంది. చంద్రబాబు ను టార్గెట్ చేయకుండా లోకేష్ ను ముప్పుతిప్పలు పెట్టడం ద్వారా టిడిపిని వ్యూహాత్మకంగా ఇరుకున పెట్టడంతో బాటు రాజకీయ చాణుక్యుడు చంద్రబాబు ను డిఫెన్స్ లో పెట్టాలన్న వ్యూహానికి కమల నాథులు పదును పెట్టేస్తున్నారు. లోకేష్ మంత్రిత్వ శాఖలో జరిగిన బాగోతాలు కేంద్ర విజిలెన్స్ విభాగానికి అందజేసినట్లు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రకటించేశారు.ఆ విచారణ పూర్తి అయితే నీరు చెట్టు పథకంలో13 వేలకోట్ల రూపాయలు ఎలా దుర్వినియోగం చేశారో లెక్క తేలుతుందన్న వీర్రాజు మాటలు బిజెపి లోకేష్ ను టార్గెట్ చేస్తున్న అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. పోలవరానికి 6500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే గ్రామీణాభివృద్ధిలో 13 వేలకోట్ల రూపాయల కేంద్ర నిధులను ఎలా ఖర్చు చేస్తారంటున్నారు సోము. మొత్తానికి బిజెపి సైతం రాబోయే ఎన్నికలకు చాలా సమయం ఉండటంతో టిడిపి చేసిన డ్యామేజ్ కి రిపేర్ చేసుకుని దూసుకుపోవాలన్న ఎత్తుగడలు వేస్తుంది. ఇవి ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

Related Posts