రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవా...! అన్నట్లు హాలీవుడ్ లీడింగ్ లేడీస్... తలచుకుంటే... నయా ఫ్యాషన్లకు కొదవ ఉండదు. తాజాగా పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ వేసిన ప్యాంటే ఇందుకు తాజా ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. హాలీవుడ్ ఫ్యాషన్లు అంటే ఆషామాషీ కాదు. పీలికల్లాంటి వస్త్రాలతోనే క్రేజీ ఫ్యాషన్లను సృష్టించడం అక్కడి డిజైనర్లకు మాత్రమే చెల్లింది. ఇక వాటిని అందంగా, హుందాగా ప్రెజంట్ చేయడం హాలీవుడ్ తారలకు వెన్నెతో పెట్టిన విద్య అని చెప్పుకోవచ్చు. తాజాగా ఇంటర్నేషనల్ పాప్ స్టార్ జెన్నీఫర్ లోపెజ్... డెనిమ్స్ ఫ్యాంటును కాస్తా... బూట్లుగా మార్చుకున్న వైనం... హేమాహేమీలైనటువంటి ఫ్యాషన్ డిజైనర్లకే... చుక్కలు చూపించింది. ఇటీవలే ఓ సినీ ఈవెంట్ కు హాజరైన జన్నీఫర్... తెల్లని చొక్కా ధరించి.. ధగధగలాడిపోయింది. అయితే అందరి కళ్లు ఆమె వేసుకున్న బూట్లపైనే పడ్డాయి. ఎందుకంటే... అమ్మడు డెనిమ్ జీన్స్ ను బూట్లుగా వాడేసింది. అయితే సడన్ గా చూసేవారికి జెన్నీ వేసుకున్న ప్యాంట్ జారిపోయిందేమోని అనిపించకమానదు. ఏమైనా.. వెర్రి వేయి తలలు అన్నట్లు... హాలీవుడ్ స్టార్లు ఏం చేసినా అదో ఫ్యాషన్ స్టేట్మెంట్ అయిపోతుంది. మరి... ఈ ట్రెండ్ ను ఎంతమంది ఫాలో అవుతారో చూడాలి.