అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. మూడేళ్ల క్రితం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన మాస్టర్‌ప్లాన్ నమూనాలు చూసి ప్రతిపక్షాలు విమర్శలు చేసిన విషయం విదితమే. అయితే ఆ విమర్శలకు సమాధానంగా ఇప్పటివరకు జరిగిన పనులకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను సీఆర్‌డీఏ ఇంటర్నెట్‌లో పెట్టింది. అచ్చు మాస్టర్ ప్లాన్‌లో ఉన్న విధంగానే రోడ్లు, భవన నిర్మాణాలు జరుగుతుండడం అందరినీ ఆకర్షిస్తోంది. ప్లాన్ కాపీతోపాటు గూగుల్ ఎర్త్ శాటిలైట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టుచేస్తున్న నెటిజన్లు సీఆర్‌డీఏ వాస్తవ చిత్రాలను ఆవిష్కరిస్తోందంటూ కామెంట్‌లు పెడుతున్నారు.
రాజధానిలో రవాణా వ్యవస్థకు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. రోడ్లు ఎలాంటి వంపులు లేకుండా గీత గీసినట్లు ఉండాలని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే సింగపూర్ సంస్థ మాస్టర్‌ప్లాన్‌లో రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్లాన్‌ను రూపొందించింది. ఆ ప్రకారమే రాజధానిలో రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్లాన్‌లో చూపించిన విధంగానే లేఅవుట్‌లు, గ్రీన్‌ప్యాచ్‌ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో చేపడుతున్నారు. రోడ్ల విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకపోవడం వల్లే అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతోందని అధికారులు చెబుతున్నారు.ఇది సీఎం పిలుపునకు స్పందించి రూ. వేల కోట్ల విలువ చేసే భూములు ఇచ్చిన రైతుల నమ్మకాన్ని, తమ నిబద్ధతని చాటిచెబుతోందని, ఈ నమ్మకాన్ని తాము నిలబెట్టుకుం టామని టీడీపీ శ్రేణలు చెబు తున్నాయి. మరోవైపు హైదరా బాద్‌లో అప్పటి సీఎం వైఎస్ హయాంలో అవుటర్ రింగు రోడ్డు విషయంలో మలుపులు తిప్పడానికి సంబంధించి వచ్చిన అవినీతి ఆరోపణలను టీడీపీ నాయకులు గుర్తుచేశారు. అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వానికి, ఇతర ప్రభుత్వాలకు మధ్య వ్యత్యాసం ఇదేనని స్పష్టం చేశారు.