'ఆర్ఎక్స్ 100' చిత్రం యువతను ఆకట్టుకుని మంచి విజయం సాధించింది. ఈ చిత్రం లో హీరోగా చేసిన కార్తికేయ నటనకు ప్రశంసలు పొందాడు. తాజాగా కార్తికేయ తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ థాను బ్యానర్లో చేయనున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఈ చిత్రానికి టీఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తాడు. "కబాలి" వంటి భారీ చిత్రాలను కలైపులి ఎస్ థాను నిర్మించాడు.