విజయనగరం జిల్లా బొబ్బిలిలో యువత సంబరాలు చేపట్టింది. నిరుపేద యువతకు నిరుద్యోగ భృతి కల్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రి వర్గానికి కృతజ్ఞతలు తెలుపుతూ బొబ్బిలి పట్టణంలో యువత భారీ ర్యాలీ నిర్వహించింది. నిరుద్యోగ భృతిపై హర్షం వ్యక్తం చేస్తూ ర్యాలీ కొనసాగింది. యువకుల కేరింతలతో బొబ్బిలి మారుమ్రోగింది. బొబ్బిలిలో రహదారులు యువతలో కిక్కిరిసిపోయాయి. మొదటగా కోట సమీపంలో ఎన్. టి.ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి స్థానిక నేతలు, యువత, టి.ఎన్.ఎస్.ఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ ప్రారంభించారు. రాష్ట్రo కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కు యువత రుణపడి ఉంటుందని,అటు భూగర్భ గనులశాఖ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు సహకారంతో జిల్లా అభివృద్ధి పధంలో కొనసాగుతోందని, ఈ సందర్భంగా పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. యువత చేపట్టిన ఈ ర్యాలీతో బొబ్బిలిలో పండగ వాతావరణం నెలకుంది.