YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కార్పొరేట్ కళాశాలలో భర్తి కాని సీట్లను వచ్చే వారం నాటికి పూర్తి సాంఘిక,గిరిజన సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు

 కార్పొరేట్ కళాశాలలో భర్తి కాని సీట్లను వచ్చే వారం నాటికి పూర్తి    సాంఘిక,గిరిజన సంక్షేమశాఖ   మంత్రి నక్కా ఆనందబాబు
బెస్ట్ ఎవైల్ బుల్ స్కూల్స్, కార్పొరేట్ కళాశాలలో చదువుకొనుటకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఇంకా భర్తి కాని వాటి సీట్లను వచ్చే వారం నాటికి పూర్తి చేయనున్నామని సాంఘిక,గిరిజన సంక్షేమశాఖ   మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. తన చాంబర్ లో సంబందిత శాఖ అధికారులతో  సమీక్ష సమావేశం నిర్వహించారు.ఎన్టీఆర్ విద్యాన్నోతి క్రింద చదువుకునే విద్యార్థులకు ఆగస్ట్ నెలాఖరికి ప్రోసెస్ పూర్తి చేసి సెప్టెంబర్ మొదటి వారంలో గా క్లాస్ లు ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు,దీనివల్ల వెయ్యి మంది విద్యార్థులకు లబ్ది చేకురుతుందని తెలిపారు ఈసంవత్సరం నుండి ఎన్టీఆర్ విద్యొన్నతి భృతిని,కోర్సు పీజు  పెంచినట్లు తెలిపారు. ప్రిలిమ్స్ పూర్తి చేసిన విద్యార్థులకు మెయిన్స్ మరియు ఇంటర్యులకు  ఆర్థిక సహయం ఇవనున్నట్లు తెలిపారు..విజయవాడ లో గ్రూప్ 2, వైజాగ్ లో గ్రూప్ 1, సివిల్స్, తిరుపతి లో బ్యాంకింగ్, ఇతర పోటీ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ స్టడి సర్కిల్ ద్వారా నిర్వహించడానికి  ఏర్పాట్లు చేయవల్సిందిగా అందు నిమిత్తం  ఫ్యాకల్టీ రిక్రుట్ మేంట్ చేసుకొని క్లాసులు ప్రారంభించవల్సిందిగా ఆదికారులకు ఆదేశించారు.. వైజాగ్ ,తిరుపతి, విజయవాడలో నిర్వహించే స్టడి సర్కిల్ సెంటర్ల పర్యవేక్షణ కు ఒక డైరెక్టర్, ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్ల కాంట్రాక్ట్ బేసిక్ పద్దతిలో నియమించాలని అధికారులకు సూచించారు..అద్దె భవనాల్లో ఉన్న హస్టల్స్    లో మెరుగైన సదుపాయలు,  పరిశుభ్రమైన వాతావరణం ఉండే విధంగా చర్యలు  తీసుకోవాలని చుచించారు. ప్రి మెట్రిక్ హాస్టల్స్ లో  చదువుకొనే విద్యార్థులకు  క్లాస్ లు చెప్పే ట్యూటర్సికి ప్రస్తుతం వేతనం 1500నుంచి 2000  వేలు  పెంచాల్సిందిగా అధికారులకు అదేశించారు..,గిరిజన  సంక్షేమ హస్టల్స్ లో ట్యూటర్స్ ని నియమించుకొవల్సిందిగా సూచించారు..  మెయింటన్స్ ,రిపేర్స్ జివో విడుదల అయ్యిందని, 5 లక్షల మెర పనులు నామినేషన్ పద్దతిలో త్వరితగిన పూర్తి చేయలని సూచించారు.. ఇందు నిమిత్తం జిల్లాల వారిగా బడ్జెట్ కేటాయింపులు చేశామని తెలిపారు. పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ కి ముగ్గురు చొప్పున కుక్,కామాటి, వాచ్ మెన్  సర్విస్ ఔట్ సొర్సింగ్ పద్దతిలో నియమించాలని అధికారులకు సూచించారు.గురుకులలో విద్యార్థులకు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని మరియు హెల్త్ కామెంట్ సెంటర్ ను పటిష్టం చేయలని సూచించారు..విద్యార్థులకు మొదటి విడతగా  రెండు జతలు యూనిఫాం  అందజేసినట్లు అధికారులు తెలిపారు..మిగిలిన రెండు జతలు 15 రోజుల్లొగా విద్యార్థులకు అందజేసి రిపొర్ట్ ఇవ్వాల్సిందిగా కోరారు.. ప్రొక్విరెమెంట్ పనులు త్వరతగిన పూర్తి చేయలని అధికారులకు ఆదేశించారు ఏటువంటి పరిస్థితులో విద్యార్థులు అసౌకర్యానికి గురి కాకుడదని అధికారులను హెచ్చరించారు ..పెండింగ్ లో ఉన్న బిల్స్ ను త్వరగా క్లియర్ చేయవల్సిందిగా ఆధికారులకు సూచించారు..వనం -మనం కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థి ఒక్క మొక్క నాటే విధంగా ప్రొత్సహించాలని అదేవిధంగా కిచన్ గార్దెన్స్ ను ఏర్పాటు చేసుకొవల్సిందిగా కొరారు..సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్నసాంఘీక,గిరిజన సంక్షేమ శాఖలో   అనేక పథకాలను వివిధ మద్యామలద్వారా  ప్రజలకు చేర వేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకొవాల్సిందిగా కొరారు..గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ శాఖలో చేపడుతున్న వివిధ అభివృధి పనులను నిర్ధిష్టమైన ప్రణాళికతో పూర్తి చేయల్సిందిగా కోరారు..రోడ్లు లేని ఏజేన్సిప్రాంతలలో పనులను ప్రత్యేక శ్రద్దతో పూర్తి చేయలని అధికారులకు ఆదేశించారు.. ప్రపంచఆదివాసి దినొత్సవం ఏర్పాట్లు పర్యవేక్షించాడానికి ప్రత్యేక కమిటి నియమించి  ఈకార్యక్రమం విజయవంతం చేయల్సిందిగా ఆందికారులను కోరారు.

Related Posts