నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. అధ్యాపకుల అటెండెన్స్‌పై ముగ్గురు సభ్యులతో కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విశ్రాంత ఐఏఎస్ సి.బి.ఎస్.వెంకటరమణ చైర్మన్‌గా, జే.ఎన్.టి.యూ సివిల్ ఇంజినీరింగ్ డిపార్టుమెంటు హెచ్.ఓ.డి స్వరూపరాణి, విశ్రాంత ఇంజినీర్ ఎం.కే.రామ్ మోహన్ సభ్యులుగా కమిటీ ఏర్పాటైంది. పూర్తి విచారణ 15 రోజుల్లో పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశింది.