- రూ.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం
- రాంజీనగర్‌కు చెందిన ఈ దొంగల ముఠా
- దేశవ్యాప్తంగా అనేక చోట్ల చోరీలు
- ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ వెల్లడి
దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను ఖమ్మం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. బ్యాంకుల నుంచి భారీగా డబ్బులు, బంగారు ఆభరణాలు తెచ్చుకునే వారిని లక్ష్యంగా చేసుకుని దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన రాంజీనగర్ ముఠాకు చెందిన నలుగురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన కేసును చేధించిన పోలీసులు నిందితుల నుంచి రూ.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
రాంజీనగర్‌కు చెందిన ఈ దొంగల ముఠా దేశవ్యాప్తంగా అనేక చోట్ల చోరీలకు పాల్పడిందని ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ వెల్లడించారు. ముఠాలో మరో ఐదుగురు సభ్యులు పరారీలో ఉన్నారని... వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. చోరీలకు పాల్పడుతున్న దొంగలు.. స్వగ్రామం రాంజీనగర్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని, ఖరీదైన ఇళ్లు నిర్మించుకున్నట్లు తమ విచారణలో తేలిందని సీపీ ఇక్బాల్ వెల్లడించారు. కేసును చేధించిన పోలీస్ అధికారులు, ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు.