YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సిద్హప్పకు... ఏంటాప్ప

సిద్హప్పకు... ఏంటాప్ప
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి సిద్ధూ అడ్డంకిగా మారాడా? కుమారస్వామిని కుదురుగా కూర్చోనివ్వడం లేదా? ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర, మంత్రి డీకే శివకుమార్ లు కూడా సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారా? అవును సిద్ధూను రా‌ష్ట్రం పరిధి నుంచి తప్పించడానికే హైకమాండ్ డిసైడ్ అయినట్లు సంకేతాలు అందుతున్నాయి. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయన ఇప్పుడు జేడీఎస్, కాంగ్రెస్ సమన్వయ కమిటీ కి ఛైర్మన్ గా ఉన్నారు. కాని ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపడుతున్నారు.నిన్న మొన్నటి వరకూ ముఖ్యమంత్రిగా చేయడంతో బలగం కూడా సిద్ధూకు బాగానే ఉంది. అందుకే ఆయన తరచూ విందు సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఎమ్మెల్యేలు తమ గ్రిప్ లోనుంచి జారిపోకుండా చూసుకుంటున్నారు. కుమారస్వామి, డీకే శివకుమార్, పరమేశ్వరలు కలసి జిల్లా ఇన్ ఛార్జి మంత్రుల నియామకాన్ని కూడా సిద్ధరామయ్య తప్పుపట్టారు.  సిద్దరామయ్య ను మాత్రం లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే సిద్ధరామయ్యను మైసూరు-కొడగు లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని పలువురు నేతలు సూచించారు. సిద్ధూ లోక్ సభ కు ఎన్నికై పార్లమెంటుకు వెళితే రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం సజావుగా సాగుతుందని, ఇటు కుమారస్వామితో పాటు కాంగ్రెస్ లోని కొందరు నేతలు కూడా భావిస్తున్నారు. అందుకే లోకల్ నేతల చేత సిద్ధూ పేరును చెప్పించారని తెలుస్తోంది. హైకమాండ్ కూడా సిద్ధూ సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. మొత్తం మీద సిద్ధరామయ్య రాష్ట్రంలో ఉండటం కంటే బయటకు పంపడమే మేలని అధిష్టానం కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు కన్పిస్తోంది.కొందరు మంత్రులు జిల్లా ఇన్ ఛార్జిల నియామకంపై అసంతృప్తిగా ఉన్నారని తెలిసి వారితో మంతనాలు జరుపుతున్నారు.కుమారస్వామి ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసినప్పుడు కూడా సిద్ధూతో తలెత్తుతున్న ఇబ్బందులను చెప్పేసి వచ్చారు. అలాగే దేవెగౌడ ఢిల్లీలో ఉండి సంకీర్ణ ప్రభుత్వానికి ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలు రానున్నాయి. రాహుల్ గాంధీ లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన బాధ్యతను సిద్ధరామయ్యకే అప్పగించాలని దాదాపుగా నిర్ణయించారు. ప్రచారం దగ్గర నుంచి అభ్యర్థుల ఎంపిక వరకూ సిద్ధూ కీలక పాత్ర పోషించనున్నారు.

Related Posts