YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు

పాత నోట్ల మార్పిడి ముఠా దొరికిపోయింది

పాత నోట్ల  మార్పిడి ముఠా దొరికిపోయింది

- రూ.99 లక్షల పాతనోట్లు ,ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం 

- మార్చేందుకు ప్రయత్నించిన ఐదుగురి అరెస్ట్‌

పాత ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేసి ఏడాదిన్నర కావస్తున్నా... ఇంకా అవి హైదరాబాద్ నగరంలో అక్కడక్కడా లభ్యమవుతూనే ఉన్నాయి. కొందరు దళారుల మాటలు నమ్మి పాతనోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చనే ఆశతో దాచుకున్న డబ్బును బయటికి తీస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. తాజాగా ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో పాతనోట్లు నిల్వ చేసుకున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.మహ్మద్ కరీం, బట్టు తిరుపతి, రిజ్వాన్, సిద్దిఖీ, అహ్మద్‌ఖాన్‌లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.99 లక్షల పాతనోట్లు, ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ ఉమామహేశ్వర శర్మ తెలిపారు. నోట్ల మార్పిడి కేసులో మెహిదీపట్నానికి చెందిన ప్రధాన నిందితుడు ఇంతియాజ్ పరారీలో ఉన్నాడని ఆయన వెల్లడించారు. లక్ష రూపాయలకు 20 శాతం కమిషన్‌తో వ్యాపారం చేస్తున్నారని, ఇలాంటి మోసగాళ్ల మాటలు నమ్మవద్దని డీసీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా 20 లక్షల రూపాయల కొత్త నోట్లు ఇస్తే తమ వద్దనున్న కోటి రూపాయల పాతనోట్లు ఇస్తామని నిందితులు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను నమ్మిస్తున్నారని ఆయన వెల్లడించారు.

Related Posts