ఆంధ్రప్రదేశ్ సీఎంగా నటించే అవకాశం తనకు లభించడం ఎంతో గొప్ప విషయమని హీరో రానా వ్యాఖ్యానించాడు. ఇటీవల బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ తో కలసి అమరావతికి వెళ్లి చంద్రబాబుతో భేటీ అయిన రానా, తన ట్విట్టర్ ఖాతాలో సామవారం ఉదయం స్పందించాడు. "ఎన్టీఆర్ బయోపిక్ లో కీలకమైన చంద్రబాబునాయుడి పాత్రను పోషించే అవకాశం లభించడం నాకు దక్కిన ఎంతో గొప్ప గౌరవం. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు నా ధన్యవాదాలు" అని ట్వీట్ చేశాడు. చంద్రబాబుతో భేటీ చిత్రాన్ని, వారి భేటీపై వచ్చి మీడియా కవరేజ్ చిత్రాలను రానా తన అభిమానులతో పంచుకున్నాడు. కాగా, ప్రస్తుతం చిత్రం షూటింగ్ ఒక షెడ్యూల్ పూర్తికాగా, వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా, ఎన్టీఆర్ బయోపిక్ విడుద కానున్న సంగతి తెలిసిందే.
. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా ‘యన్‌టిఆర్’ బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ పాత్రలో ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు. ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడు పాత్రకు రానాను ఎంపిక చేశారు. ఈ చిత్రంలో చంద్రబాబు పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందని చిత్ర బృందం చెబుతోంది.
ఈ సందర్భంగా తన పాత్ర కోసం ప్రత్యేకంగా సన్నద్ధమవ్వాలని భావించిన రానా.. చంద్రబాబును కలిసి ఈ సినిమా గురించి చర్చించారు. సమావేశంలో బాలకృష్ణ, చిత్ర దర్శకుడు క్రిష్ కూడా పాల్గొన్నారు. ఈ రానా..చంద్రబాబు హావభావాల్ని ప్రత్యేకంగా పరిశీలిస్తూ, ఆయన తరహా గెటప్ ధరించి టెస్ట్ షూట్‌లో పాల్గొన్నట్లు తెలిసింది. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరితో కలిసి బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. రెండో షెడ్యూల్‌లో రానాపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో పలువురు తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు సమాచారం. ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో రానా..జోగేంద్ర అనే రాజకీయ నాయకుడి పాత్రలో నటించారు. ఆ తర్వాత ఇప్పుడు ‘ఎన్టీఆర్’ చిత్రంలో సీఎంగా కన్పించబోతుండడంతో ఆయన పాత్రపై అంచనాలు పెరిగిపోయాయి.