YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

కొత్తగా 56 కొత్త విమానాశ్రయాలు

కొత్తగా 56 కొత్త విమానాశ్రయాలు

- 1 బిలియన్ ట్రిప్పులు హ్యాండిల్ చేసేలా ప్రణాళికలు

ఉడాన్ పథకం కింద దేశంలో కొత్తగా 56 కొత్త విమానాశ్రయాలు అభివృద్ది చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అదే సమయంలో 31 కొత్త హెలిప్యాడ్ లను కూడా అభివృద్ధి చేయనున్నారు. ఎయిర్ పోర్ట్స్ ఆధారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చేతిలో ప్రస్తుతం 124 విమానాశ్రయాలు ఉన్నాయని..వీటిని ఐదు రెట్లు పెంచుతామని జైట్లీ తన బడ్జెట్ ఫ్రసంగంలో తెలిపారు.

దేశంలో అన్ని విమానాశ్రయాలు కలిపి సంవత్సరానికి 1 బిలియన్ ట్రిప్పులు హ్యాండిల్ చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. గత కొంత కాలంగా భారత్ లో విమానయాన రంగం వేగంగా పురోగమిస్తోంది. హవాయి చెప్పులు వేసుకునే వ్యక్తి కూడా అలా ఆకాశమార్గంలో ప్రయాణించేలా ప్రభుత్వం విమాన సర్వీసులను అందుబాటులోకి తేనుందని పేర్కొన్నారు.

 

Related Posts