YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విద్యుత్ సంస్కరణలు కలిసొస్తున్నాయి

విద్యుత్ సంస్కరణలు కలిసొస్తున్నాయి

ఇంధన పొదుపులో ఆంధ్రప్రదేశ్‌ మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఇంధన సామర్థ్యానికి సంబంధించి కేంద్ర విద్యుత్‌ శాఖ తొలిసారి విడుదల చేసిన రాష్ట్ర ఇంధన సామర్థ్య సన్నద్ధత సూచీలో ఏపీ అగ్ర పథంలో నిలిచింది. ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలు సన్నద్ధతలో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్‌ 1 అని ఇప్పటికే ప్రపంచ బ్యాంకు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇంధన సామర్థ్య సంస్థ (బీఈఈ), నీతి ఆయోగ్‌ సంయుక్తంగా రూపొందించిన సూచీలోనూ ఏపీ ఇతర రాష్ట్రాల కంటే ముందువరుసలో నిలిచింది. బీఈఈ ఈ సూచీని 63 ప్రామాణికాల ఆధారంగా తీసుకుంది. ఇందులో ముఖ్యంగా భవనాలు, పరిశ్రమలు మునిసిపాలిటీలు, రవాణా వ్యయం, డిస్కంలలో ఇంధన సామర్థ్య ఫలితాలను అంచనా వేసి రూపొందిం చింది. ఇందులో ఏపీ అత్యుత్తమ సామర్థ్యం కనబరిచి అగ్ర భాగాన నిలబడగా కేరళ, పంజాబ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రలు సైతం దేశంలో ముందంజలో నిలిచాయి.ఇంధన పొదుపులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇంధన సామర్థ్యం కార్యక్రమాల అమలు వంటి కీలక అంశాలను పరిశీలించిన అనంతరం బీఈఈ ఏపీకి ఈ ర్యాంకు ఇచ్చింది. బీఈఈ సూచీలో ఐదు ఉత్తమ రాష్ట్రాలను ప్రకటించినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ మాత్రం అత్యుత్తమ విధానాలు అవలంభిస్తోందని తెలిపింది.ఆంధ్రప్రదేశ్‌ ఇతర రాష్ట్రాలన్నింటికంటే ముందుంది. మునిసిపాలి టీలు, భవనాలు, ఇళ్లు, డిస్కంలు, పరిశ్రమల్లో పీఏటీ (పెర్ఫార్మ్‌, ఎచీవ్‌, ట్రేడ్‌) పథకం ద్వారా ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలుచేస్తోంది. రవాణా రంగంలోనూ బీఈఈ కార్యక్రమాలను మెరుగ్గా అమలుచేస్తోందని ఈఈ తన నివేదికలో పేర్కొంది. ఇతర రాష్ట్రాలు తాము (బీఈఈ) రూపొందించిన ఒకటి రెండు కార్యక్రమాల అమలుకే పరిమితవుతుండగా, ఏపీ సహా ముందున్న ఐదు రాష్ట్రాలు మాత్రం ఇంధన సామర్థ్యంలో వాటి సొంత కార్యక్ర మాలను కూడా అమలుచేస్తున్నాయని బీఈఈ ప్రశంసించింది.అమరావతి మాస్టర్‌ ప్లాన్‌, డిజైన్‌కుగాను ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) ప్లాటినం అవార్డు దక్కిన విషయాన్ని సీఆర్డీయే ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఇంధన శాఖా మంత్రి కళా వెంకట్రావులకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మంత్రి కళా వెంకట్రావును, సీఎస్‌ దినేష్‌కుమార్‌ను, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి సతీష్‌చంద్ర, ప్రిన్సిపల్‌ సెక్రటరీ సాయిప్రసాద్‌, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌ జైన్‌, ట్రాన్స్‌కో సీఎండీ కే విజయానంద్‌, విద్యుత్‌ శాఖ సలహాదారు కే రంగనాథం, ట్రాన్స్‌కో జేఎండీ దినేష్‌ పరుచూరి, ఉమాపతి, డిస్కంల సీఎండీలు ఎం.ఎం.నాయక్‌, హెచ్‌వై దొర, నెడ్‌ క్యాప్‌ ఎండీ కమలాకర బాబు, ఏపీఎస్పీసీఎల్‌ ఎండీ ఆదిశేషులను అభినందించారు. బీఈఈ సూచీలో ఆంధ్రప్రదేశ్‌ జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇదే పనితీరును కొనసాగించాలన్నారు. ఇంధన సామర్థ్య ఫలితాలు సాధారణ వినియోగదారులకు దక్కాలని స్పష్టంచేశారు.

Related Posts