YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమం.. 24 గంటలు దాటితేనే చెప్పగలం - వైద్యులు

 కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమం.. 24 గంటలు దాటితేనే చెప్పగలం - వైద్యులు

 డీఎంకే అధినేత ఎం.కరుణానిధి (95) ఆరోగ్యం మరింత విషమించింది. తీవ్ర అస్వస్థతకు గురవడంతో, గత శుక్రవారం ఆయనను ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే.  నిపుణులైన వైద్యులు అందించిన చికిత్సతో ఆయన క్రమక్రమంగా కోలుకోవడం మొదలుపెట్టారు. దీంతో వైద్యులు ఆయనను రెండు రోజులపాటు కుర్చీలో కూర్చోబెట్టి ఫిజియోథెరపీ ఇచ్చారు. అయితే, సోమవారం ఉదయం ఆయన ఆరోగ్యం మళ్లీ విషమించింది. వచ్చే 24 గంటల్లో చికిత్సకు ఆయన శరీరం స్పందించే విధానాన్ని బట్టి పరిస్థితిని అంచనా వేయగలమని.. ఆయనకు వైద్యం అందిస్తున్న కావేరి ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతో డీఎంకే వర్గాలు ఒక్కసారిగా తీవ్ర ఆందోళనలో మునిగిపోయాయి.

Related Posts