డీఎండీకే అధినేత విజయకాంత్ కోలుకున్నారు. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన అమెరికాలో చికిత్స పొందారు. వైద్యం కోసం తన భార్య, కుమారుడు తో కలిసి గత నెల 7 న ఆయన అమెరికా వెళ్లారు. పక్షం రోజులకు పైగా చికిత్స పొందిన ఆయన కోలుకున్నారు. ప్రస్తుతం తన కుటుంబసభ్యులతో కలసి అమెరికాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. మరో వారం రోజులపాటు ఆయన అమెరికాలోనే ఉంటారని సమాచారం. అయన కోలుకున్నారనే వార్త తెలిసిన వెంటనే పార్టీ శ్రేణులలో ఆనందం నెలకొంది.