కాస్టింగ్ కౌచ్ అనే అంశం ప్రస్తుతం ఇండస్ట్రీ ని కుదేపేస్తుంది. తాజాగా ఈ వివాదం ఫై ప్రముఖ నటుడు అర్జున్ స్పందించారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, యాస్టింగ్ కౌచ్ అనేది నూటికి నూరు శాతం నిజమని అయన అన్నారు. అయితే దాన్ని కోసం తన కూతురు ఐశ్వర్యను సినిమాల్లో నటించకుండా ఆపలేనని ఆయన అన్నారు. తన కూతురుపై తనకు నమ్మకం ఉందని, ఆ నమ్మకంతోనే ఐశ్వర్యకు సినిమాల్లో అవకాశాలు ఇప్పించానని తెలిపారు. 38 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న తానే సినీ రంగాన్ని నమ్మకపోతే, మరెవరు నమ్ముతారని అన్నారు.